- Home
- Sports
- Cricket
- నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతున్నావ్.. ఎన్సీఎలో పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకో : చాహర్‌పై రవిశాస్త్రి ఆగ్రహం
నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతున్నావ్.. ఎన్సీఎలో పర్మనెంట్ రెసిడెన్స్ తీసుకో : చాహర్‌పై రవిశాస్త్రి ఆగ్రహం
IPL 2023: ఐపీఎల్ లో తొడ కండరాల గాయం కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

టీమిండియా పేసర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న దీపక్ చాహర్ గాయలను వేధిస్తున్నాయి. తొడ కండరాలు పట్టేయడంతో గత సీజన్ చెన్నై సూపర్ కింగ్స్.. రూ. 14 కోట్టు వెచ్చించినా అతడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక ఈ ఏడాదైనా ఫుల్ సీజన్ ఆడతాడనుకుంటే అది కూడా అయ్యే పనిలా కనిపించడం లేదు.
ఐపీఎల్-16 లో రెండు మ్యాచ్ లు ఆడిన చాహర్.. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఒక్క ఓవర్ మాత్రమే వేసి మళ్లీ తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. చాహర్ గాయంపై సీఎస్కే ఎలాంటి అప్డేట్ ఇవ్వకున్నా అతడు రాబోయే నాలుగైదు మ్యాచ్ లు ఆడడని సీఎస్కే మాజీ ఆటగాడు సురేశ్ రైనాతో పాటు చెన్నై వర్గాలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. దీపక్ తో పాటు నేషనల్ క్రికెట్ అకాడీమ (ఎన్సీఎ) పైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు నాలుగు మ్యాచ్ లు కూడా ఆడకుండానే గాయమవుతుందంటే ఇక ఎన్సీఎ ఉండి ఎందుకని..? అదే విధంగా వరుసగా నాలుగు మ్యాచ్ లు కూడా ఆడలేని క్రికెటర్ల ఫిట్నెస్ పైనా ఆయన ప్రశ్నలు సంధించాడు.
Image credit: Getty
చహర్ గాయం గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘కొంతమంది ఆటగాళ్లు ఎన్సీఎ ను తమ పర్మనెంట్ రెసిడెంట్ కింద మార్చుకుంటున్నారు. వారికి త్వరలోనే ఎన్సీఎలో పర్మినెంట్ రెసిడెంట్షిప్ కూడా రావచ్చు. అప్పుడు వాళ్లు అందులోకి ఎప్పుడు రావాలన్నా వెళ్లొచ్చు. నేనేం చెబుతున్నాననంటే.. అసలు పదే పదే గాయాలయ్యేంత క్రికెట్ ఏం ఆడుతున్నారు వీళ్లు..?
గట్టిగా నాలుగు మ్యాచ్ లు కూడా ఆడకుండానే గాయాల పాలవ్వడం ఏమిటి..? ఇలా అయితే మీరు ఎన్సీఎకు వెళ్లడం దేనికి..? మూడు మ్యాచ్ లు ఆడటం ఎన్సీఎ కు వెళ్లడం.. మళ్లీ తిరిగిరావడం.. మరో మూడు మ్యాచ్ లు ఆడటం.. ఇదే రిపీట్ అవుతోంది. ఇది ఆటగాళ్లకే కాదు. బీసీసీఐ, ఫ్రాంచైజీలు, కెప్టెన్లు, ఆటను చూసే ప్రేక్షకులకు కూడా విసుగు తెప్పించేదే.
అందుకే ఎన్సీఎ కు వెళ్లారంటే తిరిగి పూర్తి ఫిట్ అయ్యాకే బయటకు రండి. మరీ సీరియస్ గాయం అయితే ఎవరూ ఏం చేయలేరు. కానీ చిన్న చిన్న గాయాలకు కూడా పదే పదే ఎన్సీఎకు వెళ్లిరావడం కరెక్ట్ కాద. మీరు (బౌలర్లు) వేసేది నాలుగు ఓవర్లు. గట్టిగా ఆడితే టీ20 మ్యాచ్ అయ్యేది 3 గంటలు. దీనికే గాయాలు, ఎన్సీఎ అంటూ తిరిగితే ఎలా..?’అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.