- Home
- Sports
- Cricket
- రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్‌ని ఎలా వదిలేశారు బ్రో... సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉండి ఉంటేనా...
రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్‌ని ఎలా వదిలేశారు బ్రో... సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉండి ఉంటేనా...
ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అద్వితీయ పోరాటం చేశాడు రషీద్ ఖాన్. 219 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా త్వరగా అవుట్ కావడంతో భారీ విజయం దక్కుతుందని ఆశపడిన ముంబై ఇండియన్స్‌కి రషీద్ ఖాన్ రూపంలో ఊహించని షాకే తగిలింది. 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్, 20 ఓవర్లలో 191 పరుగులు చేయగలిగింది..
డేవిడ్ మిల్లర్ లేదా రాహుల్ తెవాటియాల్లో ఎవరో ఒకరు రషీద్ ఖాన్‌కి తోడుగా మరో ఎండ్‌లో నిలబడి ఉంటే మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేది కూడా. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఓడినా బౌలింగ్‌లో 4 వికెట్లు తీసిన రషీద్ ఖాన్, బ్యాటింగ్‌లో దుమ్మురేపి... ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు.
PTI Photo) (PTI05_05_2023_000419B)
ముంబై ఇండియన్స్‌పై 10 సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్ రషీద్ ఖాన్. ఇంతకుముందు 2008లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రమే ముంబైపై మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదాడు..
రషీద్ ఖాన్ ఈ ఇన్నింగ్స్ కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి కారణం రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్‌ని ఆరెంజ్ ఆర్మీ వదులుకోవడమే.. ఐపీఎల్ 2022 రిటెన్షన్ సమయంలో రషీద్ ఖాన్, తనకు రూ.15 కోట్లు కావాలని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని డిమాండ్ చేశాడు.
Image credit: PTI
అయితే అతనికి మొదటి రిటెన్షన్ ఇవ్వడం అనవసరమని భావించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ రూ.14 కోట్లతో కేన్ విలియంసన్‌ని, రూ.4 కోట్లతో ఉమ్రాన్ మాలిక్, రూ.4 కోట్లతో అబ్దుల్ సమద్‌ని రిటైన్ చేసుకుంది. అంతా చేసి 2022 సీజన్ తర్వాత కేన్ విలియంసన్‌ని వేలానికి వదిలేసింది..
కేన్ విలియంసన్‌కి పెట్టిన రూ.14 కోట్లు ఏదో రషీద్ ఖాన్‌కి ఇచ్చినా అతను టీమ్ నుంచి బయటికి వెళ్లేవాడు కాదు. రషీద్ ఖాన్ బంతితో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో, బ్యాటుతో ఎలాంటి సిక్సర్లు కొడతాడో తెలిసి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్, అతన్ని వేలానికి వదిలేయడం చెత్త నిర్ణయమని తిడుతూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి..
Image credit: PTI
గుజరాత్ టైటాన్స్‌లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు రూ.15 కోట్లు అందుకుంటున్న రషీద్ ఖాన్, 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2023 సీజన్‌లో టైటాన్స్ టేబుల్ టాపర్‌గా నిలవడంలోనూ రషీద్ ఖాన్ కీ రోల్ పోషించాడు.