MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • రాయల్స్‌ని ఆటాడుకున్న రాయల్ ఛాలెంజర్స్... జో రూట్ రాక రాక బ్యాటింగ్‌కి వచ్చి...

రాయల్స్‌ని ఆటాడుకున్న రాయల్ ఛాలెంజర్స్... జో రూట్ రాక రాక బ్యాటింగ్‌కి వచ్చి...

ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా కనిపించింది రాజస్థాన్ రాయల్స్. అంచనాలకు తగ్గట్టే మొదటి 5 మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా కనిపించింది. అయితే ఆ తర్వాతే రాయల్స్ కథ మారింది..

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 14 2023, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Sanju Samson

Sanju Samson

ఆ తర్వాత 8 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 59 పరుగులకు ఆలౌట్ అయ్యి, 112 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Jos Buttler

Jos Buttler

ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యల్ప స్కోరు. రాజస్థాన్ రాయల్స్‌కి రెండో లోయెస్ట్ స్కోరు. ఇంతకుముందు ఆర్‌సీబీపైనే 2009 సీజన్‌లో 58 పరుగులకి ఆలౌట్ అయ్యింది రాజస్థాన్ రాయల్స్...

38
Image credit: PTI

Image credit: PTI

2008లో మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్, 2009లో ఆర్‌సీబీ చేతుల్లో 58 పరుగులకి ఆలౌట్ అయితే, 2022లో రెండోసారి ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాతి ఏడాది ఆర్‌సీబీ చేతుల్లోనే 59 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

48
Jos Buttler

Jos Buttler

2022 సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసి 800+ పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన జోస్ బట్లర్, ఈ సీజన్‌లో నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు.. 

58

2009లో కేవిన్ పీటర్సన్ మొదటిసారి ఐపీఎల్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 14 సీజన్ల తర్వాత ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్ మొదటిసారి బ్యాటింగ్‌కి వచ్చిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 59 పరుగులకు చాపచుట్టేసింది..

68

100కి పైగా పరుగుల మార్జిన్‌తో విజయాన్ని అందుకోవడం ఆర్‌సీబీకి ఇది నాలుగోసారి. ముంబై ఇండియన్స్ రెండుసార్లు ఈ ఫీట్ సాధించి రెండో స్థానంలో ఉంది...

78
Image credit: PTI

Image credit: PTI

ప్రత్యర్థి జట్టుని 100 పరుగుల లోపు ఆలౌట్ చేయడం ఆర్‌సీబీకి ఇది ఏడో సారి. ముంబై ఇండియన్స్ కూడా ఏడు సార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉంది. కేకేఆర్ 6 సార్లు, సీఎస్‌కే 5 సార్లు, సన్‌రైజర్స్ 4 సార్లు ఈ ఫీట్ సాధించాయి..

88
KM Asif vs RCB

KM Asif vs RCB

ఈ మ్యాచ్‌కి ముందు -0.345గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నెట్ రన్ రేట్ ఈ మ్యాచ్ తర్వాత +0.166కి మారింది. ఈ మ్యాచ్‌కి ముందు 0.633 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, 0.14 రన్‌రేట్‌తో ఆరో స్థానానికి పడిపోయింది. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Recommended image2
Smriti Mandhana: ఒకే మ్యాచ్‌లో రెండు వరల్డ్ రికార్డ్స్.. మిథాలీ, లానింగ్ రికార్డులను బద్దలుకొట్టిన స్మృతి మంధాన
Recommended image3
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved