MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • పిచ్ బానే ఉంది! మా వాళ్లే కాస్త పిచ్చగా బ్యాటింగ్ చేశారు... సన్‌రైజర్స్ కోచ్ బ్రియాన్ లారా కామెంట్..

పిచ్ బానే ఉంది! మా వాళ్లే కాస్త పిచ్చగా బ్యాటింగ్ చేశారు... సన్‌రైజర్స్ కోచ్ బ్రియాన్ లారా కామెంట్..

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2022 సీజన్‌లో కాస్త మెరుగ్గా ఆడి 8వ స్థానంలో నిలిచింది. ఈసారి మాత్రం మళ్లీ లాస్ట్ పొజిషన్‌ కోసం గట్టిగా పోటీపడుతోంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 25 2023, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: PTI

Image credit: PTI

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 145 పరుగుల ఈజీ టార్గెట్‌ని ఛేదించలేక చతికిల పడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. పేరుకి 8వ స్థానం వరకూ బ్యాటర్లు ఉన్నా, సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో వచ్చింది ఒకే ఒక్క సిక్సర్... అది కూడా హెన్రీచ్ క్లాసిన్ బ్యాటు నుంచే...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Image credit: PTI

Image credit: PTI

‘పిచ్ చాలా బాగుంది. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తుంది కూడా. అయితే మా వాళ్లే కాస్త అతి జాగ్రత్తకు పోయి, పిచ్చగా ఆడారు. చాలా టైం ఉందిలే అన్నట్టుగా ఆఖరి ఓవర్ వరకూ సాగదీసి, మ్యాచ్‌ని ఓడగొట్టారు...

37


పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టడం నేర్చుకోవాలి. అప్పుడే పెద్ద స్కోరైనా, చిన్న స్కోరైనా ఈజీగా గెలవచ్చు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంలో అలసత్వం చూపిస్తున్నారు...

47

మెల్లిగా ఆడినా ఒక్కో పరుగు చేరుస్తూ పోతే, చేయాల్సిన లక్ష్యం పెరుగుతూ పోతుందనే ఆలోచన కూడా లేకుండా ఆడుతున్నారు. మొదటి 15 ఓవర్లలోనే మ్యాచ్‌ అయిపోతుందని అనుకున్నా...

57
PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000405B)

PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000405B)

ఎందుకంటే ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లు వస్తారు. ఇషాంత్ శర్మ, ముకేశ్, నోకియా బౌలింగ్‌లో ఓవర్‌కి 12-13 పరుగులు రాబట్టాలంటే తేలికైన పని కాదు. ఈ విషయం గురించి ముందుగానే చర్చించుకున్నాం. కానీ మా బ్యాటర్ల నిర్లక్ష్యం, వాళ్ల బౌలర్ల చురుకుతనం కారణంగా మ్యాచ్ ఓడిపోయాం...
 

67

మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. ఇలాంటి పిచ్ మీద ఈజీగా 180+ స్కోరు చేయొచ్చు. అలాంటిది వాళ్లను 144 పరుగులకే పరిమితం చేశారు. అయితే బ్యాటర్లు బాధ్యతగా ఆడడం నేర్చుకోవాలి. ఇంత చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించకపోతే వేస్ట్...

77

ఇక 7 మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పెద్దగా మార్పులు చేసి, కొత్త ప్లేయర్లను టీమ్‌లోకి తీసుకొచ్చేంత టైమ్ లేదు. ఇప్పుడున్న ప్లేయర్లనే ఆడిస్తూ, ఎలా గెలవాలో తెలుసుకోవాలి. బాధ్యతగా ఆడితే గెలవడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరబాద్ కోచ్ బ్రియాన్ లారా..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Siraj House : హైదరాబాద్ లో క్రికెటర్ సిరాజ్ ఇల్లు చూశారా? దీని విలువెంతో తెలుసా?
Recommended image2
Hardik Pandya: సీఎస్‌కే లోకి హార్దిక్ పాండ్యా? ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడింగ్‌కు స్కెచ్ !
Recommended image3
Ram Charan: బుమ్రాకు క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved