- Home
- Sports
- Cricket
- వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్... విరాట్ కోహ్లీ సెంచరీపై మహ్మద్ ఆమీర్ పోస్ట్! బాబర్ ఆజమ్‌ని ట్రోల్ చేస్తూ...
వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్... విరాట్ కోహ్లీ సెంచరీపై మహ్మద్ ఆమీర్ పోస్ట్! బాబర్ ఆజమ్‌ని ట్రోల్ చేస్తూ...
ఐపీఎల్ 2023 సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ బాదాడు. ఐపీఎల్‌లో సిక్సర్‌తో సెంచరీ అందుకోవడం ఇది మూడోసారి...

PTI Photo/Shailendra Bhojak) (PTI04_15_2023_000132B)
ఛేదనలో విరాట్ కోహ్లీకి ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లో ఏడో సెంచరీ. ఐపీఎల్‌లో ఆరు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఇంటర్నేషనల్ టీ20ల్లో ఓ సెంచరీ బాది అత్యధిక టీ20 సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు..
Virat Kohli
విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై క్రికెట్ ప్రపంచం నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీని పొడుగుతూ పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమీర్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...
‘వాట్ ఏ ఇన్నింగ్స్ వన్ అండ్ ఓన్లీ ది రియల్ కింగ్ విరాట్ కోహ్లీ... టేక్ ఏ బో’ అంటూ ట్వీట్ చేశాడు మహ్మద్ ఆమీర్. ఇందులో వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ అనడానికి కారణం పాక్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని కూడా పాక్ ఫ్యాన్స్ ‘కింగ్’ అని పిలుస్తుంటారు. దీంతో అసలైన కింగ్ కోహ్లీయేనంటూ ట్వీట్ చేశాడు ఆమీర్...
ఇక్కడ కొసమెరుపు ఏంటంటే మహ్మద్ ఆమీర్ ట్వీట్‌కి పాక్ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కారణం పాకిస్తాన్‌లో కూడా విరాట్ కోహ్లీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. పాక్ మాజీలు కూడా విరాట్ ఆటకు ఫ్యాన్స్ అయ్యామని ప్రకటించుకున్నారు...
Virat Kohli
విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై హర్భజన్ సింగ్ ‘కింగ్ కోహ్లీ, వెల్ ప్లేడ్ షేర్’ అంటూ ట్వీట్ చేస్తే... ‘వాట్ ఏ నాక్ భయ్యా’ అంటూ యజ్వేంద్ర చాహాల్ ట్వీట్ చేశాడు. ఏబీ డివిల్లియర్స్... VIRAAAAAAAAAAAAAAAAAAAAAAT అంటూ పోస్ట్ చేస్తే, టామ్ మూడీ, రషీద్ ఖాన్, యూసఫ్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ కూడా కోహ్లీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు..
PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000347B)
‘చాలామంది ప్లేయర్లు విజయం కోసం ఆడతారు, కానీ విరాట్ కోహ్లీ మాత్రం తన ఆటతో టీమ్‌ని గెలిపిస్తాడు. కుర్రాళ్లు విరాట్ కోహ్లీ ఆట నుంచి నేర్చుకోవాల్సింది ఇదే...’ అంటూ పోస్ట్ చేశాడు మదన్ లాల్...
Image credit: PTI
కుల్దీప్ యాదవ్ ‘ది కింగ్’ అని పోస్ట్ చేస్తే, ‘మొదటి బాల్‌కి విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడినప్పుడే అతను ఈరోజు చెలరేగిపోతాడని అర్థమైంది. విరాట్, ఫాఫ్ ఇద్దరూ పూర్తిగా మ్యాచ్‌ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. వాళ్లు బిగ్ షాట్స్ ఆడడమే కాదు, వికెట్ల మధ్య అద్భుతంగా పరుగెడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్..
Image credit: PTI
‘ఇది అసలైన విరాట్ కోహ్లీ వింటేజ్ ఇన్నింగ్స్. ఒకే మ్యాచ్‌లో రెండు టాప్ క్వాలిటీ సెంచరీలు, ఫ్యాన్స్‌కి పండగే. క్లాసిన్- కోహ్లీ శభాష్’ అంటూ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.