- Home
- Sports
- Cricket
- ముంబై టీమ్‌లో సూర్యకు మించిన స్టార్ లేడు!... హర్భజన్ సింగ్ కామెంట్స్, రోహిత్ ఫ్యాన్స్ సీరియస్..
ముంబై టీమ్‌లో సూర్యకు మించిన స్టార్ లేడు!... హర్భజన్ సింగ్ కామెంట్స్, రోహిత్ ఫ్యాన్స్ సీరియస్..
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఆడిన ప్లేయర్ హర్భజన్ సింగ్. ముంబై ఇండియన్స్ తరుపున మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన హర్భజన్ సింగ్, ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు..

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు హర్భజన్ సింగ్. అయితే ఈ సందర్భంగా భజ్జీ చేసిన కొన్ని వ్యాఖ్యలు, రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి కోపం తెప్పించాయి.
Image credit: PTI
‘సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా ఉన్నన్ని రోజులు, ముంబై ఇండియన్స్‌కి విజయాలు అందిస్తూనే ఉంటాడు. సూర్య క్రీజులోకి వస్తుంటే, ఫ్యాన్స్ అందరూ అరుస్తూ స్వాగతం పలుకుతున్నారు...
Image credit: PTI
ప్రారంభంలో సచిన్... సచిన్... అనేవాళ్లు. ఆ తరవ్ాత మలింగ, మలింగ అన్నారు. ఇప్పుడు ముంబైలో ఒకే సౌండ్ వినబడుతోంది... సూర్యకుమార్ యావ్... నాకు తెలిసి ముంబై ఇండియన్స్ టీమ్‌లో సూర్యకంటే పెద్ద ప్లేయర్ లేడు...
ఇప్పుడున్న టీమ్‌లో సూర్య కంటే బాగా ఆడేవాళ్లు నాకు కనిపించడం లేదు. అతని ఆట, అతని షాట్స్ వేరే లెవెల్. అతని వికెట్ తీయడం తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కి ఓ డాట్ బాల్ వేస్తే అదే బౌలర్లకు పెద్ద అఛీవ్‌మెంట్‌లా మారింది..
Image credit: PTI
సూర్యకుమార్ యాదవ్‌కి నేను చేయగలిగింది ఒక్కటే, అతని ఆటను సలాం కొట్టడం. ఇప్పుడు సూర్య ఒక్కడే ఒంటి చేత్తో ముంబై ఇండియన్స్‌ని మోస్తున్నాడు. మిగిలిన వాళ్లు బాగానే ఆడుతున్నారు కానీ సూర్య వేరే లెవెల్..’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...
సూర్యకుమార్ యాదవ్‌ని పొగడడం వరకూ ఒకే కానీ, ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని అంటున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్.
Image credit: PTI
తనను రిటైన్ చేసుకోలేదని హర్భజన్ సింగ్‌కి రోహిత్ శర్మపై కోపం ఉండి ఉంటుందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్..