MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • గ్రౌండ్‌లో గొడవ పడ్డ నితీశ్ రాణాకి ఫైన్! హృతిక్ షోకీన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌కి కూడా...

గ్రౌండ్‌లో గొడవ పడ్డ నితీశ్ రాణాకి ఫైన్! హృతిక్ షోకీన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌కి కూడా...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప మిగిలిన అన్ని టీమ్స్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ దూసుకుపోతున్నాయి. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చి, తాము కూడా రేసులో ఉన్నామని ఘనంగా చాటింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Apr 17 2023, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో సునాయస విజయం అందుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా, ముంబై ఇండియన్స్ బౌలర్ హృతిక్ షోకీన్ గొడవ పడడం హాట్ టాపిక్ అయ్యింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

10 బంతులు ఆడి 5 పరుగులే చేసిన నితీశ్ రాణా, హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి రమన్‌దీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ సమయంలో నిరాశగా పెవిలియన్‌కి వెళ్తున్న నితీశ్ రాణాని హృతిక్ షోకీన్ సెడ్జ్ చేశాడు..

36

దీనికి నితీశ్ రాణా కూడా ఘాటుగానే స్పందించి బూతులు తిట్టాడు. ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న సూర్యకుమార్ యాదవ్, పియూష్ చావ్లా... నితీశ్ రాణాని శాంతపరిచి పెవిలియన్‌కి పంపించారు.  19 వేల మంది అమ్మాయిలతో నిండిన స్టేడియంలో ఇలా బూతులు మాట్లాడడం, ఇలాంటి ప్రవర్తన కరెక్ట్ కాదని ముంబై ఇండియన్స్ యజమాని నీతూ అంబానీ వ్యాఖ్యానించింది..

46

గ్రౌండ్‌లో క్రమశిక్షణా నియమావళి ఆర్టికల్ 2.21 కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించినందుకు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ మేనేజ్‌మెంట్...
 

56
Image credit: PTI

Image credit: PTI

అలాగే నితీశ్ రాణాని రెచ్చగొట్టి అతనితో గొడవ పడిన ముంబై ఇండియన్స్ బౌలర్ హృతిక్ షోకీన్‌కి కూడా జరిమానా పడింది. ఆర్టికల్ 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు హృతిక్ షోకీన్ మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోతపడనుంది. 

66
PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000371B)

PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000371B)

రోహిత్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతుండడంతో కేకేఆర్‌తో మ్యాచ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్‌పై కూడా వేటు వేసింది బీసీసీఐ. స్లో ఓవర్ రేటు కారణంగా సూర్యకుమార్ యాదవ్ ‌కి రూ.12 లక్షలు జరిమానా విధించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image2
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image3
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved