- Home
- Sports
- Cricket
- నవీనూ.. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావ్ నువ్వు..! కోహ్లీని మళ్లీ గెలికిన లక్నో బౌలర్
నవీనూ.. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావ్ నువ్వు..! కోహ్లీని మళ్లీ గెలికిన లక్నో బౌలర్
IPL 2023: ఐపీఎల్-16లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఆఫ్గాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మరోసారి విరాట్ కోహ్లీని గెలికాడు. దీనికి గంభీర్ కూడా..

ఐపీఎల్ -16లో భాగంగా ఈ నెల ఒకటో తారీఖున లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ బౌలర్, ఈ సీజన్ లో లక్నోకు ఆడుతున్న నవీన్ ఉల్ హక్ - ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగిన విషయం విదితమే.
నవీన్ ను కోహ్లీ స్లెడ్జ్ చేయడం.. దానికి నవీన్ కూడా ధీటుగానే బదులివ్వడం.. కోహ్లీ తన షూ ను చూపిస్తూ కామెంట్స్ చేయడం విదాదానికి దారి తీసింది. ఇదే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకునేప్పుడు కూడా వాదులాడుకున్నారు. దీంతో బీసీసీఐ ఈ ఇద్దరిపై చర్యలు తీసుకుంది.
కాగా ఈ వివాదం ముగిశాక కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ‘కనిపించేదంత నిజం కాదు’అని పోస్టు చేయగా నవీన్ కూడా ‘నువ్వు దేనికి అర్హుడివో నీకు అదే దక్కుతుంది. ఏదైనా అలాగే జరుగుతుంది. అలాగే సాగుతుంది...’ అంటూ స్టోరీస్ లో రాసుకొచ్చాడు. ఆ తర్వాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడికి వచ్చింది ఐపీఎల్ ఆడటానికి.. ఎవరితో గొడవపడటానికో మరెవరినో నిందించడానికి కాదు..’ అని అన్నాడు.
తాజాగా నవీన్ ఉల్ హక్ కోహ్లీని మరోసారి గెలికాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో గంభీర్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘మీతో ఇతరులు ఎలా వ్యవహరించాలని కోరుకుంటారో మీరు కూడా వారితో అలాగే ఉండండి. వాళ్లు మీతో ఎలా మాట్లాడులనుకుంటారో మీరు కూడా వారితో అలాగే మాట్లాడండి..’అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టు ద్వారా అతడు మొన్న కోహ్లీతో గొడవలో తాను ఎలా ఉంటానన్నది స్పష్టంగా చెప్పాడు.
ఇక దీనిపై గంభీర్ కూడా స్పందించాడు.. ‘నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు. ఎప్పుడూ మార్చుకోకు..’అని కామెంట్ పెట్టాడు. దీనికి నవీన్ కూడా.. ‘తప్పకుండా సార్.. 100 శాతం అలాగే ఉంటా..’అని బదులిచ్చాడు. ఈ ఇద్దరూ కోహ్లీనే టార్గెట్ చేశారన్నది పోస్టును చూస్తే ఇట్టే అర్థమవుతున్నది.
ఇప్పటికే గంభీర్, గంగూలీ, నవీన్ లతో గొడవతో కోహ్లీ ఇమేజ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఆందోళనగా ఉన్న విరాట్ ఫ్యాన్స్ కు ఇది మరింత ఆగ్రహం తెప్పించింది. నవీన్ ను టార్గెట్ చేస్తూ.. ‘నిన్న గాక మొన్నొచ్చిన నీకే ఇంతుంటే 15 ఏండ్లుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న మా కోహ్లీకి ఎంతుండాలి..?’, ‘నవీనూ.. ఎగిరెగిరి పడకు. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావ్ నువ్వు. ఆగస్టులో ఇండియా -ఆఫ్గాన్ సిరీస్ ఉంది కదా. నీకు అప్పుడుంది..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై కోహ్లీ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.