MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • వాళ్లు వీళ్లు ఎందుకు? నా బయోపిక్‌లో నేనే యాక్ట్ చేస్తా... విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

వాళ్లు వీళ్లు ఎందుకు? నా బయోపిక్‌లో నేనే యాక్ట్ చేస్తా... విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

మహేంద్ర సింగ్ ధోనీ, అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, మిథాలీ రాజ్, ప్రవీణ్ తాంబే.. ఇలా కొందరు మాజీ క్రికెటర్ల జీవిత కథ ఆధారంగా సినిమాలు వచ్చాయి, కొన్ని మంచి విజయం సాధించాయి. త్వరలో బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా రాబోతోంది... విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి చాలామంది నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 20 2023, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందని ఆ మధ్య టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ సమయంలో విజయ్ దేవరకొండ కూడా కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందని కామెంట్ చేశాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ కూడా విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందని కామెంట్ చేశారు... 

28

తాజాగా రాబిన్ ఊతప్పతో ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీకి ఈ ప్రశ్నే ఎదురైంది. ‘మీ బయోపిక్ మూవీలో ఏ హీరో నటిస్తే బాగుంటుంది?’ అని రాబిన్ ఊతప్ప అడడగా, విరాట్ కోహ్లీ ఏ మాత్రం ఆలోచించకుండా... ‘నేను... ’ అంటూ  నవ్వేశాడు. దీంతో కోహ్లీ బయోపిక్ గురించి చర్చ మొదలైంది. 

38

విరాట్ కోహ్లీ జీవితంలో కష్టాలు, అవరోధాలు, అవమానాలు, ట్విస్టులు, లవ్ స్టోరీ, ఇగో గొడవలు, సక్సెస్... ఓ మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన దినుసులన్నీ ఉన్నాయి. సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ జీవితం మీద సినిమా వస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం గ్యారెంటీ అంటారు అతని అభిమానులు...

48

18 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన విరాట్ కోహ్లీ, ఆయన అంత్యక్రియలు ముగిసిన తర్వాత నేరుగా వెళ్లి క్రికెట్ మ్యాచ్ ఆడాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో తన టీమ్‌ని గెలిపించాడు. కెప్టెన్‌గా అండర్19 వరల్డ్ కప్ గెలిచి, టీమిండియాలోకి దూసుకొచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు...

58
Kohli Fit

Kohli Fit

టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న టాప్ 4 ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, బీసీసీఐతో విభేదాలతో ఆ పొజిషన్ నుంచి తప్పుకున్నాడు. కోచ్ అనిల్ కుంబ్లేతో విభేదాలు, ఆ తర్వాత వచ్చిన రవిశాస్త్రితో సాన్నిహిత్యం... టీమ్ మేట్ రోహిత్ శర్మతో ఇగో గొడవలు...

68

సౌరవ్ గంగూలీ, బీసీసీఐ బాస్‌ అయ్యాక బలవంతంగా విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు పావులు కదపడం, బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో ఈ మొత్తం తతంగాన్ని బయటపెట్టడం...  విరాట్ కోహ్లీ జీవితంలో మలుపులు, ట్విస్టులు బోలెడు...
 

78

అంతేనా కెరీర్ ఆరంభంలో జెనిలీయాతో డేటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత అనుష్క శర్మ ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నాడు. మధ్యలో కొందరు బాలీవుడ్ భామలతోనూ విరాట్ డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. మూడేళ్ల బ్రేక్ తర్వాత సెంచరీ చేసి కమ్‌బ్యాక్ ఇవ్వడం.. ఇలా విరాట్ బయోపిక్‌లో హై మూమెంట్స్ ఎన్నో, ఇంకెన్నో... 
 

88
Virat Kohli, Anushka Sharma

Virat Kohli, Anushka Sharma

మరి కోహ్లీ తన బయోపిక్‌లో నిజంగా తానే నటిస్తాడా? అలా అయితే భార్య అనుష్క శర్మ సహకారంతో క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చాక సినిమాల్లోకి వెళ్లబోతున్నాడా? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju : ధోనీ, హార్దిక్‌లకు సంజూ షాక్.. ఇది కదా మాస్ ఎంట్రీ అంటే !
Recommended image2
IPL 2026 : లక్ ఎంతో కాలం ఉండదు బాసూ ! వైభవ్ సూర్యవంశీకి మాస్ వార్నింగ్
Recommended image3
Mumbai Indians : రోహిత్ శర్మకు హార్దిక్ వార్నింగ్? ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోంది బాసూ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved