- Home
- Sports
- Cricket
- ఆ ఒక్క ఓవర్ వల్లే ఓడిపోయాం! అదే నేను చేసిన తప్పు... పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్..
ఆ ఒక్క ఓవర్ వల్లే ఓడిపోయాం! అదే నేను చేసిన తప్పు... పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్..
ఐపీఎల్ 2023 సీజన్‌లో హాట్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా కనిపించింది పంజాబ్ కింగ్స్. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన సామ్ కుర్రాన్‌ని రూ.18 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, శిఖర్ ధావన్‌ని కెప్టెన్‌గా ఎంచుకుంది...

(PTI Photo/Ravi Choudhary)(PTI05_13_2023_000485B)
మొదటి మ్యాచ్‌లో కేకేఆర్‌ని ఓడించి ఐపీఎల్ 2023 సీజన్‌ని విజయంతో ఆరంభించిన పంజాబ్ కింగ్స్, ఆ విజయాలను కొనసాగించలేకపోయింది. ఈజీగా గెలిచే మ్యాచుల్లో చేజేతులా ఓడిన పంజాబ్ కింగ్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 15 పరుగుల తేడాతో ఓడింది....
లియామ్ లివింగ్‌స్టోన్ 94 పరుగులు చేసి ఆఖరి ఓవర్ వరకూ పోరాడినా పంజాబ్ కింగ్స్‌కి విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. హాఫ్ సెంచరీ చేసి క్రీజులో ఉన్న అధర్వ టైడ్‌ని రిటైర్డ్ అవుట్‌గా డగౌట్‌కి తీసుకురావడం పంజాబ్ కింగ్స్‌ని తీవ్రంగా దెబ్బ తీసింది...
PTI Photo/Kamal Kishore)(PTI04_15_2023_000333B)
అధర్వ తర్వాత క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ డకౌట్ కాగా షారుక్ ఖాన్ 6, సామ్ కుర్రాన్ 11 పరుగులు చేసి వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో లక్ష్యానికి చేరువగా వచ్చినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది పంజాబ్ కింగ్స్...
Harpreet Singh
ఆఖరి 2 ఓవర్లలో 41 పరుగులు రాబట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 6, 4, 6, 4తో పాటు రెండు వైడ్లు, ఓ సింగిల్‌తో కలిసి మొత్తంగా 23 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ స్కోరు 213 పరుగులకే చేరింది..
‘బంతి చక్కగా స్వింగ్ అవుతోంది. అయితే దాన్ని మేం సరిగ్గా వాడుకోలేకపోయాం. ఆరంభంలో వికెట్లు తీసి ఉంటే కచ్చితంగా గెలిచే వాళ్లం. లియామ్ లివింగ్‌స్టోన్ బాగా ఆడాడు..
ఆఖరి ఓవర్‌లో స్పిన్నర్‌తో వేయించాలనే నా నిర్ణయం బెడిసి కొట్టింది. అక్కడే మ్యాచ్ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ ఓవర్‌కి ముందు ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో 18 పరుగులు వచ్చాయి. అందుకే స్పిన్నర్ అయితే ఢిల్లీ బ్యాటర్లు ఇబ్బంది పడతారని అనుకున్నా...
Image credit: PTI
పవర్ ప్లేలో మా బౌలర్లు వికెట్ తీసి ఉంటే ఇంత భారీ స్కోరు వచ్చేది కాదు. ఈ సీజన్‌లో మా బౌలింగ్ సరిగ్గా లేదు. అదీకాకుండా మేం పవర్ ప్లేలో వికెట్ కోల్పోయాం.
Image credit: PTI
మొదటి ఓవర్ మెయిడిన్ వచ్చింది. అక్కడ ఆరు విలువైన బంతులు పోవడం మ్యాచ్ రిజల్ట్‌ని మార్చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్..