- Home
- Sports
- Cricket
- ఉప్పల్‌లో చూసుకుందాం రండి!... 6 వేల క్లబ్‌లో చేరిన రోహిత్ శర్మ! ఇషాన్ కొట్టిన షాట్ దెబ్బకి...
ఉప్పల్‌లో చూసుకుందాం రండి!... 6 వేల క్లబ్‌లో చేరిన రోహిత్ శర్మ! ఇషాన్ కొట్టిన షాట్ దెబ్బకి...
హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. జస్ప్రిత్ బుమ్రా సీజన్ మొత్తానికి దూరం కాగా, జోఫ్రా ఆర్చర్ ఒకే మ్యాచ్ ఆడి టీమ్‌కి దూరమయ్యాడు..

Rohit Sharma
సరైన ఫాస్ట్ బౌలర్ లేకుండా సీజన్‌ని ఆరంభించిన ముంబై ఇండియన్స్, బ్యాటింగ్‌పైనే భారం వేసింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 10 బంతులు ఆడి 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 21 పరుగులు చేసి అవుటైన రోహిత్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కూడా దక్కిన ఆరంభాన్ని సద్వినియోగ చేసుకోలేకపోయాడు. 18 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నటరాజన్ బౌలింగ్‌లో అయిడిన్ మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
అవుట్ అవ్వడానికి ముందు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు బాదిన రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో 6 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 6844 పరుగులు చేసి టాప్‌లో ఉండగా శిఖర్ ధావన్ 6477, డేవిడ్ వార్నర్ 6109 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. 6 వేల పరుగుల ఐపీఎల్ క్లబ్‌లో చేరిన నాలుగో బ్యాటర్ రోహిత్ శర్మ..
Image credit: PTI
6 వేల ఐపీఎల్ పరుగులు అందుకునేందుకు డేవిడ్ వార్నర్ 4285 బంతులు తీసుకుంటే, విరాట్ కోహ్లీ 4595 పరుగులు వాడుకున్నాడు. రోహిత్ శర్మ 4616 బంతులు వాడి మూడో స్థానంలో నిలిచాడు. శిఖర్ ధావన్ 4738 బంతుల్లో 6 వేల ఐపీఎల్ పరుగులు అందుకుని నాలుగో స్థానంలో ఉన్నాడు..
ఇన్నింగ్స్‌ల పరంగా మాత్రం ఆలస్యంగా 6 వేల క్లబ్‌లో చేరిన బ్యాటర్ రోహిత్ శర్మ. డేవిడ్ వార్నర్ 165 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 6 వేల పరుగులు అందుకుని టాప్‌లో ఉంటే విరాట్ కోహ్లీ 188, శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు. కెరీర్ ఆరంభంలో లోయర్ ఆర్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ ఏకంగా 227 ఇన్నింగ్స్‌ల్లో 6 వేల క్లబ్‌లో చేరాడు..
PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000366B)
ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ కొట్టిన స్ట్రైయిక్ డ్రైవ్, నేరుగా వచ్చి రోహిత్ శర్మను తాకింది. ఈ దెబ్బకు దాదాపు కిందపడబోయిన రోహిత్ శర్మ, తేరుకున్నాడు. ఆ తర్వాత నాలుగు బంతులే ఆడి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. రోహిత్ అవుట్ అయ్యే సమయానికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్..
PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000353B)
మ్యాచ్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఛానెల్‌లో మాట్లాడిన రోహిత్ శర్మ.. ‘మేము వచ్చేశాము. హైదరాబాద్ ఫ్యాన్స్ పదండి ఉప్పల్‌కి...’ అంటూ తెలుగులో పలుకులు పలికిన రోహిత్, బ్యాటింగ్‌లో ఫ్యాన్స్ ఆశించిన ఇన్నింగ్స్ ఆడకుండానే పెవిలియన్ చేరాడు..