- Home
- Sports
- Cricket
- సిక్సర్లు ఇవ్వాలన్నా మేమే, అదే సిక్సర్లు కొట్టాలన్నా మేమే... ముంబై ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు...
సిక్సర్లు ఇవ్వాలన్నా మేమే, అదే సిక్సర్లు కొట్టాలన్నా మేమే... ముంబై ఇండియన్స్‌తో మామూలుగా ఉండదు...
ఐపీఎల్ 2023లో ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ని ప్రారంభించి, ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది ముంబై ఇండియన్స్. టీమ్‌లో ఒక్కడంటే ఒక్క సరైన అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్ లేకపోయినా బ్యాటర్ల పుణ్యమాని, ముంబై వరుస విజయాలు అందుకుంటోంది...

Image credit: PTI
పంజాబ్ కింగ్స్ (ముంబైలో మ్యాచ్), గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ (మొహాలీ మ్యాచ్)లపై వరుసగా 200+ స్కోర్లు సమర్పించారు ముంబై ఇండియన్స్ బౌలర్లు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు మ్యాచుల్లో 200+ స్కోర్లు ఇచ్చిన మొదటి టీమ్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్...
Image credit: PTI
ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 199 పరుగులు ఇచ్చిన ముంబై ఇండియన్స్, మరొక్క పరుగు ఇచ్చి ఉంటే ఐదోసారి 200 స్కోరు ఇచ్చినట్టు అయ్యేది. అయితే 200 స్కోరు ఇవ్వడంలోనే కాదు, దాన్ని ఛేదించడంలోనూ టాప్‌లో నిలిచింది ముంబై ఇండియన్స్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో 100 సిక్సర్లు సమర్పించిన మొట్టమొదటి టీమ్ ముంబై ఇండియన్స్. అంతేకాదు ఈ సీజన్‌లో 100 సిక్సర్లు బాదిన మొదటి టీమ్ కూడా ముంబై ఇండియన్సే. ఈ సీజన్‌లో ముంబై బ్యాటర్లు 108 సిక్సర్లు బాదితే, ముంబై బౌలర్ల బౌలింగ్‌లో 109 సిక్సర్లు వచ్చాయి..
అంతా బాగానే ఉంది కానీ ప్లేఆఫ్స్‌లో ఇలాంటి బౌలింగ్‌తో నెట్టుకురావడం మాత్రం ముంబై ఇండియన్స్‌కి చాలా కష్టమైపోవచ్చు. అదీకాకుండా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 2021 టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి..
Image credit: PTI
2020 సీజన్ ఐపీఎల్ విన్నర్ ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవాలంటే.. బ్యాటింగ్ ఒక్కటే బలంగా ఉంటే సరిపోదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయంలో ఇది చాలాసార్లు నిరూపితమైంది.
PTI Photo/Kunal Patil)(PTI05_11_2023_000251B)
అయితే ఆర్‌సీబీతో పోలిస్తే ముంబై బౌలర్లు కాస్త బెటరే కావచ్చు. కానీ ప్లేఆఫ్స్‌లో ఒత్తిడిని అధిగమించి, మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇవ్వాలంటే అనుభవం కావాలి. డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించగలగాలి.
లసిత్ మలింగ, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, కిరన్ పోలార్డ్ వంటి అనుభవజ్ఞులు ఉండడం వల్లే ముంబై ఇంతకుముందు ఐదుసార్లు టైటిల్ గెలిచింది. ఈసారి వాళ్లవెరూ లేకుండా టైటిల్ గెలిస్తే, అది సరికొత్త చరిత్రే అవుతుంది.