MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • రూ.1003.7 కోట్లు! ఐపీఎల్ ప్లేయర్ల కోసం వెయ్యి కోట్లు పెట్టిన ఆర్‌సీబీ... ముంబై కూడా వెనకాలే...

రూ.1003.7 కోట్లు! ఐపీఎల్ ప్లేయర్ల కోసం వెయ్యి కోట్లు పెట్టిన ఆర్‌సీబీ... ముంబై కూడా వెనకాలే...

ఐపీఎల్ అంటే వరల్డ్‌ రిచెస్ట్ క్యాష్ లీగ్... ఆటగాళ్ల రాతను ఒక్కరోజులో మార్చేసే క్రికెట్ లీగ్. సత్తా ఉన్న ప్లేయర్ కోసం ఎన్ని కోట్లు అయినా పెట్టేందుకు సిద్ధంగా ఉంటాయి ఫ్రాంఛైజీలు. మరి ప్లేయర్ల కోసం భారీగా ఖర్చు చేసిన ఫ్రాంఛైజీ ఏదో తెలుసా... ఇంకేది ఆర్‌సీబీయే...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 20 2023, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ప్రతీ సీజన్‌కి ముందు స్టార్ ప్లేయర్లను వేలంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేయడం, వాళ్లు బాగా ఆడడం లేదని తర్వాతి సీజన్‌లో వదిలేసి.. మళ్లీ వేరే స్టార్లను కొనుగోలు చేయడం ఆర్‌సీబీకి ఆనవాయితీగా వస్తున్న అలవాటు. అందుకే ఐపీఎల్ 2008 నుంచి 2022 వరకూ ఆర్‌సీబీ ఆటగాళ్లకు చెల్లించిన మొత్తం శాలరీ వెయ్యి కోట్లు దాటేసింది. ఇప్పటిదాకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ల కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.1003.7 కోట్లు. వెయ్యి కోట్లకు పైగా జీతాలు ఇచ్చిన మొట్టమొదటి ఫ్రాంఛైజీ ఆర్‌సీబీయే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Mumbai Indians

Mumbai Indians

ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ప్లేయర్లను అంత ఈజీగా వదులుకోదు. అయితే ముంబైలో ఉంటే క్రిస్ లీన్, జేమ్స్ నీశమ్ వంటి స్టార్లు కూడా రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందే. ఐపీఎల్ 2023 సీజన్ వరకూ ఆటగాళ్ల పారితోషికాల కింద రూ.978.3 కోట్లు చెల్లించింది ముంబై ఇండియన్స్...

39
Image credit: PTI

Image credit: PTI

రెండు సార్లు టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కూడా స్టార్ ప్లేయర్ల కోసం కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఐపీఎల్ 2023 సీజన్ వరకూ కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆటగాళ్ల కోసం చెల్లించిన మొత్తం రూ.939.6 కోట్లు...
 

49

ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా, ప్లేయర్ల కొనుగోలు విషయంలో ఎక్కడా తగ్గదు ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 2023 వరకూ క్యాపిటల్స్, ప్లేయర్ల జీతాల కింద చెల్లించిన మొత్తం రూ.918.7 కోట్లు. ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ల కోసం రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేసిన నాలుగో జట్టుగా ఉంది ఢిల్లీ క్యాపిటల్స్...

59
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్‌లో ప్లేయర్ల కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉండే పంజాబ్ కింగ్స్, 2023 సీజన్ వరకూ ఆటగాళ్ల జీతాల నిమిత్తం రూ.860.9 కోట్లు ఖర్చు చేసింది.. 

69

నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 2 సీజన్లు బ్యాన్ పడి.. ఐపీఎల్‌కి దూరమైంది. అయినా జీతాల విషయంలో టాప్ 6లో నిలిచింది సీఎస్‌కే. 2023 సీజన్ వరకూ చెన్నై సూపర్ కింగ్స్, ప్లేయర్లకు చెల్లించిన జీతాలు రూ.854.1 కోట్లు. ఆ రెండు సీజన్లు కూడా ఆడి ఉంటే, సీఎస్‌కే టాప్ 3లో ఉండి ఉండేది...

79
Image Credit: PTI

Image Credit: PTI

సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చింది 2013లోనే అయినా, ఆటగాళ్ల కోసం కోట్లు ఖర్చు పెట్టడంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్లేయర్లను మార్చేందుకు, కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు పెద్దగా ఇష్టపడిన సన్‌రైజర్స్... ఇప్పటిదాకా ప్లేయర్ల కోసం రూ.735.4 కోట్లు ఖర్చు చేసింది... 

89
Image credit: PTI

Image credit: PTI

సీఎస్‌కే పాటు రెండు సీజన్లు బ్యాన్‌కి గురైన రాజస్థాన్ రాయల్స్... ఐపీఎల్‌లో ప్లేయర్ల కోసం రూ.704.8 కోట్లు ఖర్చు చేసింది. మొట్టమొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ 2022 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది...
 

99

కొత్త ఫ్రాంఛైజీలు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ఎక్కడా రాజీపడడం లేదు. రాహుల్ కోసం రూ.17 కోట్లు చెల్లిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్, రెండు సీజన్లలో కలిపి రూ.179.8 కోట్లు.. ఆటగాళ్ల జీతాల కోసం చెల్లిస్తుంటే... ఐపీఎల్ 2022 టైటిల్ విన్నర్ గుజరాత్ జెయింట్స్ రూ.174.3 కోట్లు చెల్లిస్తూ ఆఖరి పొజిషన్‌లో ఉంది..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved