- Home
- Sports
- Cricket
- సిరాజ్ చేసిన దానికి ఫైన్ ఎందుకు పడలేదు చెప్మా... చిచ్చు రాజేసి, సైడ్ అయిపోయిన మియ్యా...
సిరాజ్ చేసిన దానికి ఫైన్ ఎందుకు పడలేదు చెప్మా... చిచ్చు రాజేసి, సైడ్ అయిపోయిన మియ్యా...
ఐపీఎల్ 2023 సీజన్‌లో వెటరన్ ప్లేయర్లు కమ్‌బ్యాక్ ఇవ్వడమే ప్రత్యేకం అనుకుంటే ఫైన్‌లు, జరిమానాలతో బీసీసీఐ బాదుడు కూడా నడుస్తోంది. స్లో ఓవర్ రేటు కారణంగా ఇప్పటికే కోట్ల రూపాయలు బీసీసీఐ ఖాతాలో చేరింది..

Kohli vs Gambhir
హెల్మెట్ నేలకేసి బాది సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఆవేశ్ ఖాన్, గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల విరాట్ కోహ్లీ జరిమానాలు కట్టగా గ్రౌండ్‌లో గొడవ పడి నితీశ్ రాణా, హృతిక్ షోకీన్ ఫైన్ కట్టారు. ఆర్‌సీబీ, లక్నో మ్యాచ్‌లో జరిగిన గొడవలో భాగమైన విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ 100 శాతం మ్యాచ్ ఫీజు ఫైన్‌గా చెల్లించారు..
Mohammed Siraj
వీరిద్దరి మధ్య వాగ్వాదం జరగడానికి కారణమైన ఆఫ్ఘాన్ యంగ్ బౌలర్ నవీన్ వుల్ హక్‌కి 50 శాతం మ్యాచ్ ఫీజు కోత పడింది. అయితే ఇంత రచ్చ జరగడానికి కారణమైన మహ్మద్ సిరాజ్‌ని మాత్రం బీసీసీఐ పట్టించుకోకపోవడం విశేషం..
ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్, ఆ ఓవర్‌లో ఆఖరి బంతికి నో బాల్ వేశాడు. అంపైర్ మొదట వైడ్‌గా ప్రకటించినా థర్డ్ అంపైర్, దాన్ని నో బాల్‌గా గుర్తించాడు. ఆ తర్వాతి బంతికి సింగిల్ కూడా నిలువరించిన మహ్మద్ సిరాజ్, బ్యాటర్ నవీన్ వుల్ హక్ దగ్గరికి వెళ్లి కావాలని బంతి, వికెట్ల కేసి కొట్టాడు...
సిరాజ్ చేసిన ఈ పనికి నవీన్ వుల్ హక్ ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన తర్వాత ఆవేశంతో ఊగిపోయిన నవీన్ వుల్ హక్, ఆ తర్వాతి ఓవర్‌లో ఫోర్ బాదడంతో విరాట్ సెడ్జ్ చేయడం... చిన్న చిన్నగా మాటామాటా పెరిగి పెద్ద గొడవగా మారింది...
Image credit: PTI
నవీన్ వుల్ హక్ క్రీజు దాటకపోయినా అతని దగ్గరికి వెళ్లి కళ్లు ఉరిమి చూసిన మహ్మద్ సిరాజ్, కావాలని బంతితో వికెట్లను కొట్టాడు. ఓ రకంగా ఇది ప్రవర్తనా నియామావళికి విరుద్దమే. అయిత గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్ గొడవ కారణంగా సిరాజ్ చేసిన పనిని రిఫరీ పట్టించుకోలేదు..