- Home
- Sports
- Cricket
- పెళ్లి చేసుకున్న ఢిల్లీ ఆల్ రౌండర్.. వారం రోజుల్లో అన్ని పనులూ ముగించుకుని రావాల్సిందే..
పెళ్లి చేసుకున్న ఢిల్లీ ఆల్ రౌండర్.. వారం రోజుల్లో అన్ని పనులూ ముగించుకుని రావాల్సిందే..
Mitchell Marsh Wedding: ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న మిచెల్ మార్ష్ ఓ ఇంటివాడయ్యాడు. నేడు అతడి వివాహం ఘనంగా జరిగింది.

Mitchell Marsh
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న మిచెల్ మార్ష్ ఓ ఇంటివాడయ్యాడు. ఐపీఎల్ -16లో భాగంగా రెండు మ్యాచ్ లు ఆడిన మార్ష్.. పెళ్లి కోసమే నాలుగు రోజుల క్రితం సిడ్నీకి పయనమయ్యాడు. ఈనెల 8న గువహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు ఆడలేదు.
తన ప్రేయసి గ్రెట మాక్ తో సోమవారం (ఏప్రిల్ 10న) మార్ష్ వివాహం ఘనంగా జరిగింది. సౌత్ వెస్ట్ ఆస్ట్రేలియాలో కొద్దిమంది కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను మార్స్ తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నాడు. మార్ష్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
గతవారం సిడ్నీకి వెళ్లిన మార్ష్.. త్వరలోనే మళ్లీ పెళ్లి తదనంతర కార్యక్రమాలను ముగించుకుని టీమ్ తో చేరనున్నాడు. ఈ వారంతంలో మార్ష్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తో కలిసే అవకాశముంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
మార్ష్ రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ తో పాటు ఏప్రిల్ 11న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 15న బెంగళూరుతో జరిగే మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని చెప్పాడు. ఆ తర్వాత అతడు టీమ్ తో కలిసే అవకాశముంది.
ఈ ఢిల్లీ ఆల్ రౌండర్ లక్నో, గుజరాత్ తో మ్యాచ్ లలో బ్యాటింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. బౌలింగ్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మరి పెళ్లి జోష్ లో మార్ష్ ప్రదర్శన ఏమైనా మారుతుందేమో చూడాలి. మార్ష్ లేకపోవడంతో ఢిల్లీ.. రొవ్మన్ పావెల్ తో మ్యాచ్ లను ఆడిస్తున్నది. కానీ పావెల్ కూడా రాజస్తాన్ తో మ్యాచ్ లో విఫలమయ్యాడు.
ఈ సీజన్ లో ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. మరి రేపు (మంగళవారం) ముంబైతో జరిగే మ్యాచ్ లో అయినా ఢిల్లీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఇది కూడా ఓడితే ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు రాను రాను క్షీణిస్తాయి.