- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎవరు? రేసులో మయాంక్, మార్క్‌రమ్, భువీ, రాహుల్ త్రిపాఠి...
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎవరు? రేసులో మయాంక్, మార్క్‌రమ్, భువీ, రాహుల్ త్రిపాఠి...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపించిన కేన్ విలియంసన్, వచ్చే సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడబోతున్నాడు. అంతకుముందు ఆరెంజ్ ఆర్మీకి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఉన్నాడు. మరి వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్‌ని నడిపించే కెప్టెన్ ఎవరు?

ఓ ఓపెనర్, స్పిన్నర్, కెప్టెన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొంది. పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ని రూ.8 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది ఆరెంజ్ ఆర్మీ. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది...
అలాగే ఇంగ్లాండ్ బ్యాటర్ హారీ బ్రూక్‌ని రూ.13 కోట్ల 25 లక్షల భారత మొత్తానికి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. పాక్ పర్యటనలో టెస్టుల్లో మూడు సెంచరీలు చేసిన హారీ బ్రూక్, టీ20 సిరీస్‌లో అదరగొట్టి రెండు సిరీసుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు...
Sunrisers Hyderabad
హారీ బ్రూక్‌ని వన్‌డౌన్ బ్యాటర్‌గా, అయిడిన్ మార్క్‌రమ్‌ని టూ డౌన్ ప్లేయర్‌గా వాడే అవకాశాలు ఉన్నాయి. అంతా బాగానే ఉన్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ని నడిపించే బాధ్యత ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది...
Image credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేశాడు మయాంక్ అగర్వాల్. అయితే కెప్టెన్సీ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేక బ్యాటర్‌గానూ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి మయాంక్ అగర్వాల్‌కి మరోసారి కెప్టెన్సీ అప్పగించడమే వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది...
Image Credit: PTI
సౌతాఫ్రికా బ్యాటర్ అయిడిన్ మార్క్‌రమ్‌తో పాటు భారత బ్యాటర్ రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్,భువనేశ్వర్ కుమార్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ రేసులో నిలిచారు. భువీ కెప్టెన్సీలో ఇప్పటిదాకా 7 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రెండింట్లో మాత్రమే విజయాలు దక్కించుకుంది..
Rahul Tripathi
రాహుల్ త్రిపాఠి, ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన ఇస్తూ రాణిస్తున్నాడు. భారత జట్టులో చోటు కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాడు. రాహుల్ త్రిపాఠికి కెప్టెన్సీ అప్పగించడం కూడా పెద్ద రిస్కే అవుతుంది. త్రిపాఠి కెప్టెన్సీ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయగలడా? లేదా? అనేది అనుమానమే...
భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కీ ప్లేయర్‌గా మారాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుందర్‌కి కెప్టెన్సీ ఇవ్వడమే ఎస్‌ఆర్‌హెచ్ ముందున్న మంచి ఆప్షన్. సుందర్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడకపోతే హెన్రీచ్ క్లాసిన్, అదిల్ రషీద్, గ్లెన్ ఫిలిప్స్ వంటి ప్లేయర్ల వైపు చూడాల్సిన పరిస్థితి ఆరెంజ్ ఆర్మీది..
ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అయినా పంజాబ్ కింగ్స్‌ని ఆరో స్థానంలో నిలపగలిగాడు మయాంక్ అగర్వాల్. టైటిల్ రాకపోయినా పర్లేదు, కాస్త బెటర్ పర్ఫామెన్స్ ఇస్తే చాలని అనుకుంటే మయాంక్ అగర్వాల్‌కే మళ్లీ కెప్టెన్సీ అప్పగించొచ్చు సన్‌రైజర్స్. ఎస్‌ఆర్‌హెచ్ దిక్కుమాలిక స్ట్రాటెజీ కారణంగా జట్టులో మరో కెప్టెన్ కనిపించడం లేదు..