- Home
- Sports
- Cricket
- అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు... శివమ్ మావి, ముకేశ్ కుమార్‌లకు భారీ ధర..
అన్‌క్యాప్డ్ ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు... శివమ్ మావి, ముకేశ్ కుమార్‌లకు భారీ ధర..
ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డులు బద్ధలు అవుతాయి. విదేశీ ఆల్‌రౌండర్ల కోసం కోట్లకు కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు, గత సీజన్లలో సత్తా చాటుకున్న అన్‌క్యాప్డ్ స్వదేశీ ప్లేయర్ల కోసం కూడా భారీగా ఖర్చు పెట్టాయి. శివమ్ మావి, ముకేశ్ కుమార్ చౌదరి, కెఎస్ భరత్ వంటి స్వదేశీ ప్లేయర్లకు మంచి ధర దక్కింది..

కె.ఎం. కైఫ్, ముస్తాబా యూసఫ్, లాన్స్ మోరిస్‌లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. యంగ్ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావిని కొనుగోలు చేయడానికి కేకేఆర్, సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడ్డాయి.
రూ.6 కోట్లకు శివమ్ మావిని కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. కేకేఆర్ తరుపున ఆడిన శివమ్ మావి, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షాకి మొదటి ఓవర్‌లోనే ఆరుకి ఆరు ఫోర్లు ఇచ్చాడు...
గత సీజన్‌లో సీఎస్‌కే తరుపున ఆడిన ముకేశ్ కుమార్ చౌదరిని కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. రూ.5 కోట్ల 50 లక్షలకు ముకేశ్ కుమార్‌ని సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్..
చింతల్ గాంధీ, ఇజార్‌హక్ నవీద్, ఎస్ మిథున్, గత సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన మురుగన్ అశ్విన్, సన్‌రైజర్స్ ఆడిన శ్రేయాస్ గోపాల్... అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిపోయారు. హిమాన్షు శర్మను రూ.20 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...
తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్ కోసం సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ పోటీపడ్డాయి. రూ.1 కోటి 20 లక్షలకు కోన శ్రీకర్ భరత్‌ని దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్..
ఉపేంద్ర సింగ్ యాదవ్‌ని రూ.25 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. యంగ్ సెన్సేషన్ మహ్మద్ అజారుద్దీన్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. వైభవ్ అరోరాని కొనుగోలు చేయడానికి కేకేఆర్, లక్నో పోటీపడ్డాయి. రూ.60 లక్షలకు వైభవ్‌ని కొనుగోలు చేసింది కేకేఆర్...
ఫాస్ట్ బౌలర్ యష్ ఠాకూర్‌ని లక్నో జట్టు రూ.45 లక్షలకు కొనుగోలు చేసింది.
Narayan Jagadeesan
విజయ్ హాజారే ట్రోఫీలో రికార్డు లెవెల్లో దుమ్మురేపిన నారాయణ్ జగదీశన్ కోసం కేకేఆర్, సీఎస్‌కే పోటీపోటీగా బిడ్డింగ్ చేశాయి. ఎన్ జగదీశన్‌ని రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
అండర్ 19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్, మినీ వేలంలో అమ్ముడుపోలేదు. సమర్థ్ వ్యాస్, సన్వీర్ సింగ్‌లని సన్‌రైజర్స్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన రికార్డున్న అభిమన్యు ఈశ్వరన్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
ఆల్‌రౌండర్ నిషాంత్ సింధు కోసం కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడ్డాయి. రూ.60 లక్షలకు నిషాంత్‌ని సొంతం చేసుకుంది సీఎస్‌కే. శశాంక్ సింగ్, సుమిత్ కుమార్, దినేశ్ బణాలను ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు..
స్వదేశీ ప్లేయర్లు అన్‌మోల్‌ప్రీత్ సింగ్, ఛేతన్ ఎల్‌ఆర్, శుభం ఖజురియా, రోహన్ కన్నుమల్, హిమ్మత్ సింగ్‌లను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు...
షేక్ రషీద్‌ని చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. స్వదేశీ బౌలర్ వివ్‌రంత్ శర్మను కొనుగోలు చేయడానికి కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడ్డాయి. రూ.2 కోట్ల 60 లక్షలకు వివ్‌రంత్ శర్మను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్...
ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబ్ రహ్మాన్ కూడా ఏ జట్టునీ ఆకర్షించలేకపోయాడు. భారత స్పిన్నర్ మయంక్ మార్కండేని రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్..
Adam Zampa
ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌ని రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. విండీస్ స్పిన్నర్ అకీల్ హుస్సేన్ అమ్ముడుపోని ప్లేయర్ల లిస్టులో చేరిపోయాడు...
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాని కూడా ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ కూడా మరోసారి ఐపీఎల్ వేలంలో నిరాశే ఎదురైంది...
న్యూజిలాండ్ బౌలర్ ఆడమ్ మిల్నే కూడా తొలి రౌండ్‌లో అమ్ముడుపోలేదు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్‌ని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.. 2021 వేలంలో రూ.14 కోట్లు దక్కించుకున్న రిచర్డ్‌సన్, ఈసారి అందులో 10 శాతం మాత్రమే దక్కించుకోగలిగాడు..
భారత సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది..
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ కూడా అన్‌సోల్డ్ ప్లేయర్ల లిస్టులో చేరిపోయాడు. రిస్ తోప్లేని రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
భారత సీనియర్ బౌలర్ జయ్‌దేవ్ ఉనద్కట్‌ని బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...