- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ 2023లో తెలుగు కుర్రాళ్లు... ఎట్టకేలకు ఓ తెలుగోడిని తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్...
ఐపీఎల్ 2023లో తెలుగు కుర్రాళ్లు... ఎట్టకేలకు ఓ తెలుగోడిని తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్...
పంజాబ్ కింగ్స్ టీమ్‌లో ఆ రాష్ట్ర కుర్రాళ్లకు అవకాశాలు దొరుకుతాయి. చెన్నై సూపర్ కింగ్స్, తమిళ కుర్రాళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. బెంగళూరు కూడా అంతే! అయితే పేరుకి హైదరాబాద్ టీమ్ అయినా సన్‌రైజర్స్‌లో తెలుగు ప్లేయర్లు కనిపించరు. ఎట్టకేలకు ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఓ తెలుగు కుర్రాడిని కొనుగోలు చేసింది ఎస్‌ఆర్‌హెచ్..

KS Bharat
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన కెఎస్ భరత్, గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లోకి వెళ్లాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బ్యాటర్ కావడంతో కోన శ్రీకర్ భరత్‌కి రెండే రెండు మ్యాచులు ఆడే అవకాశం వచ్చింది..
ఐపీఎల్ 2023 మినీ వేలంలో శ్రీకర్ భరత్‌ని రూ.1 కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ఉన్నాడు. సాహా వయసు 37 ఏళ్లు. దీంతో సాహా స్థానంలో కెఎస్ భరత్, మంచి ఆప్షన్‌గా మారతాడని భావిస్తోంది గుజరాత్ టైటాన్స్...
ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న అన్‌క్యాప్డ్ ఆంధ్ర క్రికెటర్‌గా నిలిచాడు కెఎస్ భరత్. ఇంతకుముందు భారత టెస్టు క్రికెటర్, కాకినాడ కుర్రాడు హనుమ విహారి, 2019 సీజన్‌లో రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడాడు. భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, రూ.6.25 కోట్లకు సీఎస్‌కే తరుపున ఆడుతున్నాడు.
India U19 World Cup
అండర్ 19 వరల్డ్ కప్ 2022 గెలిచిన భారత జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన షేక్ రషీద్‌ని వేలంలో రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. షేక్ రషీద్‌తో పాటు అండర్19 వరల్డ్ కప్ ఆడిన రాజవర్థన్ కూడా సీఎస్‌కేలోనే ఉన్నాడు. షేక్ రషీద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించాడు..
Image Credit: PTI
పేరుకి హైదరాబాద్ జట్టు అయినా తెలుగు ప్లేయర్లను కొనుగోలు చేయదనే విమర్శలకు ఫుల్‌స్టాప్ పెడుతూ 2023 మినీ వేలంలో ఓ తెలుగు కుర్రాడిని కొనుగోలు చేసింది ఎస్‌ఆర్‌హెచ్.. విశాఖపట్నం జిల్లాకి చెందిన నితీశ్ కుమార్ రెడ్డిని మినీ వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఆరెంజ్ ఆర్మీ...
తెలంగాణ రాష్ట్రం నుంచి భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఒక్కడే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడబోతున్నాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ని రూ.7 కోట్లకు రిటైన్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..