ఐపీఎల్‌లో మెరిసిన మోహ్సీన్ ఖాన్ ఏమయ్యాడు... లక్నో సూపర్ బౌలర్‌కి తీవ్ర గాయం! సర్జరీ పూర్తి...
ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ స్టార్ మోహ్సీన్ ఖాన్. లక్నో సూపర్ జెయింట్స్ తరుపున అదరగొట్టిన మోహ్సీన్ ఖాన్, మిచెల్ స్టార్క్ స్టైల్ బౌలింగ్‌తో అదరగొట్టాడు.. 9 మ్యాచులు ఆడి 5.97 ఎకానమీతో 14 వికెట్లు తీసిన మోహ్సీన్ ఖాన్, క్రికెట్ విశ్లేషకులను మెప్పించాడు. అయితే సెలక్టర్లు మాత్రం మోహ్సీన్ ఖాన్‌ని పట్టించుకోలేదు...
ఉత్తరప్రదేశ్‌కి చెందిన మోహ్సీన్ ఖాన్ వయసు 24 ఏళ్లు. 2020లో ముంబై ఇండియన్స్‌కి అమ్ముడుపోయిన మోహ్సీన్ ఖాన్, 2022 సీజన్‌లో మొట్టమొదటిసారి ఐపీఎల్‌లో ఆడాడు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో టాప్ క్లాస్ బ్యాటర్లకు చుక్కులు చూపించి, టీమిండియా ఫ్యూచర్ బౌలింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియాకి కీ బౌలర్‌గా మారిన మహ్మద్ షమీ, మోహ్సీన్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ మోహ్సిన్ ఖాన్‌ను నాకు నాలుగు నెలలు ఇస్తే అతన్ని ఇండియాలోనే బెస్ట్ ఆల్‌రౌండర్‌గా చేస్తా. అతను బౌలరే కాదు.. మంచి బ్యాటర్ కూడా....’ అంటూ వ్యాఖ్యానించాడు మహ్మద్ షమీ...
అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠిలకు జట్టుకి ఎంపిక చేసినా, తుది జట్టులో ఆడించడానికి ఆసక్తి చూపించని టీమిండియా మేనేజ్‌మెంట్... మోహ్సీన్ ఖాన్‌ని అస్సలు పట్టించుకోలేదు.
భారత సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి గాయం కావడంతో అతని రిప్లేస్ చేసే ప్లేయర్లలో మోహ్సీన్ ఖాన్ కూడా వినిపించింది.. అయితే షమీ కారణంగా మోహ్సీన్‌కి మరోసారి నిరాశే ఎదురైంది..
ఇంతకీ మోహ్సీన్ ఖాన్ ఏమయ్యాడు.ప్రస్తుతం మోహ్సీన్ ఖాన్, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతనికి చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. త్వరలోనే మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టబోతున్నాడు మోహ్సీన్ ఖాన్. అయితే అతనికి గాయం ఎలా అయ్యిందనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం తెలియలేదు..