- Home
- Sports
- Cricket
- మీ తిట్లే నాకు దీవెనలు.. వాళ్లు ఇంకా అరవాలని చూశా : ‘కోహ్లీ.. కోహ్లీ’ నినాదాలపై నవీన్ కామెంట్స్
మీ తిట్లే నాకు దీవెనలు.. వాళ్లు ఇంకా అరవాలని చూశా : ‘కోహ్లీ.. కోహ్లీ’ నినాదాలపై నవీన్ కామెంట్స్
IPL 2023 Playoffs: ఐపీఎల్ - 16 వేలానికి ముందు రూ. 50 లక్షల ధరతో లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకున్న నవీన్ ఉల్ హక్ ఈ సీజన్ లో బాగా ఆడి ఫేమస్ అయినదానికంటే కోహ్లీతో గొడవపడి క్రేజ్ దక్కించుకున్నాడు.

సాధారణంగా ఐపీఎల్ లో ఏ ఆటగాడైనా బాగా ఆడి ఫేమస్ అవుతారు రింకూ సింగ్ మాదిరిగా ఏదైనా సంచలన ఇన్నింగ్స్ ఆడితో ఓవర్ నైట్ స్టార్ అవుతారు. కానీ అఫ్గాన్ పేసర్, ఈ సీజన్ కు ముందు రూ. 50 లక్షల ధరకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకోగా ఆ జట్టు తరఫున ఆడుతున్న నవీన్ ఉల్ హక్.. మ్యాచ్ లలో మెరుగైన ప్రదర్శనలు చేయకున్నా ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు.
లక్నో - బెంగళూరు మధ్య ఈనెల 1న కోహ్లీతో వాగ్వాదం తర్వాత సోషల్ మీడియాలో కూడా అతడిని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం కోహ్లీ అభిమానులకు కోపం తెప్పించింది. ముంబై - బెంగళూరు మ్యాచ్ లో కోహ్లీ ఔట్ అయ్యాక తన ఇన్‌స్టాగ్రామ్ లో మామిడి పండ్లను పోస్ట్ చేస్తూ.. ‘స్వీట్ మ్యాంగోస్’అని పోస్టు చేయడం కోహ్లీ ఫ్యాన్స్ కు పుండు మీద కారం చల్లినట్టైంది.
ఈ పోస్టు తర్వాత నవీన్ ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు అతడిని స్లెడ్జ్ చేశారు. ఈడెన్ గార్డెన్, హైదరాబాద్ తో పాటు తాజాగా చెన్నై లో కూడా నవీన్ బౌలింగ్ కు రాగానే ‘కోహ్లీ.. కోహ్లీ’అని నినదించారు. దీనికి తోడు నవీన్ కూడా వారిని మరింత రెచ్చగొట్టే విధంగా ‘నోర్మూసుకోండి’, ‘ఇంకా అరవండి’ అన్నట్టుగా సైగ చేయడం.. ఎలిమినేటర్ లో అయితే కెఎల్ రాహుల్ మాదిరగా రెండు చెవులు మూసుకుని సెలబ్రేట్ చేసుకోవడం కోహ్లీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.
లక్నో - ముంబై మ్యాచ్ ముగిశాక నవీన్ విలేకరులతో మాట్లాడాడు. స్టేడియంలో ప్రేక్షకులు తాను బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు ‘కోహ్లీ.. కోహ్లీ’అని అరిస్తే తనకు మరింత కిక్ వస్తుందని.. ఒక్క కోహ్లీనే కాదని ఎవరి పేరు జపించినా తాను సంతోషపడతానని చెప్పాడు.
నవీన్ మాట్లాడుతూ.. ‘నేను బరిలో ఉంటే బయట నుంచి వచ్చే శబ్దాలను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ పోతా.. ప్రొఫెషనల్ క్రికెటర్ గా వాటిని నేను పట్టించుకోను. ఏ క్రీడలో అయినా బాగా ఆడితే పొగిడినోళ్లే.. ఆడకుంటే విమర్శిస్తారని తెలిపాడు.
లక్నో మెంటార్ గౌతం గంభీర్ గురించి మాట్లాడుతూ.. ‘గంభీర్ ఒక లెజెండ్. భారత క్రికెట్ కు అతడు ఏం చేశాడనేది మనందరికీ తెలుసు. లక్నో మెంటార్ గా ఆయనను చాలా గౌరవిస్తా. నేను ఆయన దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా..’అని అన్నాడు.