MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • గొడవలొద్దు, జరిగిందంతా ఇక్కడితో మరిచిపోండి... ఆర్‌సీబీకి లక్నో సూపర్ జెయింట్స్ మెసేజ్...

గొడవలొద్దు, జరిగిందంతా ఇక్కడితో మరిచిపోండి... ఆర్‌సీబీకి లక్నో సూపర్ జెయింట్స్ మెసేజ్...

గత మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2023 సీజన్‌లో అడుగు దూరంలో నిలిచిపోయింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి ఉంటే ఈపాటికి ఆర్‌సీబీ ఫ్యాన్స్ జోరు వేరే రేంజ్‌లో ఉండేది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 22 2023, 06:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులు హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీపై తనకున్న ఫ్రస్టేషన్ మొత్తం చూపించాడు విరాట్ కోహ్లీ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బెంగళూరులో ఆర్‌సీబీపై ఆఖరి బంతికి ఆఖరి వికెట్‌ని కాపాడుకుంటూ ఉత్కంఠ విజయం అందుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఈ విజయం తర్వాత ఆవేశ్ ఖాన్, లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్‌ల ప్రవర్తన హాట్ టాపిక్ అయ్యింది...
 

37

లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్‌ని ఓడించిన తర్వాత దీన్ని డబుల్, త్రిబుల్ డోస్‌తో తిరిగి ఇచ్చాడు విరాట్ కోహ్లీ. నవీన్ వుల్ హక్‌ని సెడ్జ్ చేసి, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్‌తో గొడవ పడి, గౌతమ్ గంభీర్‌తో అయితే పెద్ద రణరంగమే క్రియేట్ చేశాడు..

47

ఐపీఎల్ 2023 సీజన్‌లో పరమ బోరింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో ఊహించని ఈ సీన్స్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించాయి. కోహ్లీ - నవీన్, గంభీర్ గురించి చాలా పెద్ద చర్చే జరిగింది. ఈ సంఘటన తర్వాత అటు విరాట్, ఇటు నవీన్ ఒకరి మీద ఒకరు పగ పెంచేసుకున్నారు..
 

57

దీంతో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగితే... నా సామీ రంగ! టీఆర్పీ రికార్డులు బ్రేక్ అవుతాయని అనుకున్నారంతా. అయితే అక్కడ ఓడిపోవడం కంటే, ఇక్కడే ఓడిపోవడం బెటర్ అనుకున్నట్టుగా ఆర్‌సీబీ గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది..

67

ఆర్‌సీబీ ఓడిపోయినా, ఆ టీమ్ ఫ్యాన్స్ మాత్రం లక్నోని అంత ఈజీగా వదలరు. అందుకే రాజీకి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, ‘ఇచ్చారు, తీసుకున్నారు. ఇక దీన్ని ఇక్కడితో వదిలేద్దాం.  ఆఖరి దాకా బాగా పోరాడారు ఆర్‌సీబీ. వచ్చే సీజన్‌లో కలుద్దాం’ అంటూ ట్వీట్ చేసింది లక్నో...

77
Image credit: PTI

Image credit: PTI

కెఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలో దూరమైన కృనాల్ పాండ్యా కెప్టెన్సీలో వరుసగా రెండు విజయాలు అందుకుని ప్లేఆఫ్స్‌కి వచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఊపిరి పీల్చుకున్న లక్నో, ఫైవ్ టైం టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. 
 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా vs పాకిస్తాన్ ఫైట్ ఎప్పుడంటే?
Recommended image2
అభిమానుల‌కు కిక్కిచ్చిన ఇండియా, వెస్టిండిస్ మ్యాచ్‌.. అయినా అసంతృప్తిగా ఉంద‌న్న గంభీర్‌
Recommended image3
Asian Games 2026: ఇషాన్ కిషన్ సునామీ బ్యాటింగ్, బుమ్రా మ్యాజిక్.. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved