- Home
- Sports
- Cricket
- లాస్ట్ సీజన్ హీరోలు, ఈ సీజన్‌లో జీరోలు... ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ ప్లేయర్లు వీరే...
లాస్ట్ సీజన్ హీరోలు, ఈ సీజన్‌లో జీరోలు... ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ ప్లేయర్లు వీరే...
ఐపీఎల్ 2023 సీజన్ క్లైమాక్స్‌కి చేరుకుంది. మరో 4 మ్యాచుల్లో విజేత ఎవరో తేలిపోనుంది. గత సీజన్‌లో సూపర్ హిట్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన ప్లేయర్లు, ఈసారి అట్టర్ ఫ్లాప్ ప్రదర్శనతో జీరోలుగా మిగిలారు. వారిలో టాప్‌లో ఉన్నాడు పృథ్వీ షా...
- FB
- TW
- Linkdin
Follow Us
)
Prithvi Shaw (PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)
పృథ్వీ షా: ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 6 మ్యాచుల్లో 47 పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ అయిన పృథ్వీ షా, సీజన్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. హాఫ్ సెంచరీతో రీఎంట్రీ ఇచ్చినా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మళ్లీ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లో 106 పరుగులు చేసిన పృథ్వీ షా, 13.25 సగటుతో ఫ్లాప్ అయ్యాడు. ఇందులో పంజాబ్ కింగ్స్‌పై చేసిన హాఫ్ సెంచరీ 54 పరుగులు తీసేస్తే మిగిలిన 7 మ్యాచుల్లో కలిపి 52 పరుగులే చేశాడు ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్...
జోస్ బట్లర్: ఐపీఎల్ 2022 సీజన్‌లో 4 సెంచరీలు, మరో 4 హాఫ్ సెంచరీలతో 863 పరుగులు చేసిన జోస్ బట్లర్, 2023 సీజన్‌లో ఐదు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ సీజన్‌లో బట్లర్ 4 హాఫ్ సెంచరీలు చేసినా గత సీజన్‌తో పోలిస్తే సగం పరుగులు (392) కూడా చేయలేకపోయాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ చేరలేకపోవడానికి బట్లర్ ఫెయిల్యూర్ కూడా ఓ కారణం..
అంబటి రాయుడు: ఐపీఎల్ 2020లో 359, 2021 సీజన్‌లో 257, 2022 సీజన్‌లో 274 పరుగులు చేసిన అంబటి రాయుడు, ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో 122 పరుగులే చేశాడు. అజింకా రహానేకి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ రావడంతో ఇప్పటిదాకా రాయుడి బ్యాటు నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు..
Image credit: PTI
రాహుల్ త్రిపాఠి: 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 413 పరుగులు చేసి ఈ పర్ఫామెన్స్‌తోనే టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు రాహుల్ త్రిపాఠి. అయితే ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో కలిపి 273 పరుగులే చేశాడు త్రిపాఠి, ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. రాహుల్ త్రిపాఠి ఫెయిల్యూర్ సన్‌రైజర్స్‌ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
deepak hooda
దీపక్ హుడా: గత సీజన్‌లో 15 మ్యాచుల్లో 14 ఇన్నింగ్స్‌ల్లో 451 పరుగులు చేసి లక్నో ప్లేఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించిన దీపక్ హుడా, ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 11 మ్యాచుల్లో కలిపి 69 పరుగులే చేసిన దీపక్ హుడా, సీజన్‌లో ఒకే ఓవర్ బౌలింగ్ చేసి వికెట్ తీయలేకపోయాడు...
Image credit: PTI
షాబజ్ అహ్మద్: గత సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 219 పరుగులు చేసిన షాబజ్ అహ్మద్, బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగానే అతనికి 10 మ్యాచుల్లో అవకాశం ఇచ్చింది ఆర్‌సీబీ. అయితే ఈ మ్యాచుల్లో 6 సార్లు బ్యాటింగ్‌కి వచ్చిన షాబజ్ అహ్మద్, మొత్తంగా 42 పరుగులే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
దినేశ్ కార్తీక్: గత సీజన్‌లో ఏబీ డివిల్లియర్స్ లేని లోటు తేలికుండా ఆర్‌సీబీకి మ్యాచ్ ఫినిషర్‌గా మారాడు దినేశ్ కార్తీక్. ఈ పర్ఫామెన్స్‌తోనే టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కూడా ఆడేశాడు. అయితే ఈ సీజన్‌లో అతని నుంచి అలాంటి బ్యాటింగ్ పర్ఫామెన్స్ రాలేదు. 2023 సీజన్‌లో 13 మ్యాచుల్లో 140 పరుగులే చేసిన దినేశ్ కార్తీక్, ఆర్‌సీబీ ఫెయిల్యూర్‌కి కారణంగా మిగిలిపోయాడు.
Harshal Patel
హర్షల్ పటేల్: ఐపీఎల్ 2022 సీజన్‌లో 19 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, 7.66 ఎకానమీతో బౌలింగ్ చేసి డెత్ ఓవర్లలో వికెట్లు తీస్తూ అదరగొట్టాడు. అయితే 2023లో 14 వికెట్లు తీసిన హర్షల్ పటేల్, గత మూడు సీజన్ల కంటే దారుణంగా 9.66 ఎకానమీతో పరుగులు సమర్పించాడు.
Image credit: PTI
ఉమేశ్ యాదవ్: గత సీజన్‌లో 16 వికెట్లు తీసి, కేకేఆర్‌కి కీ బౌలర్‌గా మారిన ఉమేశ్ యాదవ్, ఈ సీజన్‌లో 8 మ్యాచుల్లో ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఉమేశ్ యాదవ్ ఫెయిల్యూర్, కేకేఆర్‌ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది..
Image credit: PTI
కుల్దీప్ యాదవ్: ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 21 వికెట్లు తీసి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు కుల్దీప్ యాదవ్. అయితే ఈ సీజన్‌లో అతను 14 మ్యాచుల్లో కలిపి 10 వికెట్లే తీశాడు. ఎకానమీ (7.37) చాలా మెరుగుపడినా కుల్దీప్‌కి ఈసారి వికెట్లు దక్కలేదు.
Anrich Nortje
ఆన్రీచ్ నోకియా: ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన బలం ఆన్రీచ్ నోకియా, ఈ సీజన్‌లో 10 మ్యాచులు ఆడి 10 వికెట్లే తీశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన నోకియా, ఈసారి ధారాళంగా పరుగులు సమర్పించి, ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి ఓ కారణంగా నిలిచాడు.
టి నటరాజన్: ఐపీఎల్ 2022 సీజన్‌లో 11 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి అదరగొట్టాడు నటరాజన్. అయితే ఈ సీజన్‌లో 12 మ్యాచులు ఆడి నట్టూకి 10 వికెట్లే దక్కాయి.