MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆఖరి 3 బాల్స్ ధోనీకి, మొదటి 3 బాల్స్ రోహిత్ శర్మకి... హిట్ మ్యాన్ డకౌట్లపై ట్రోల్స్...

ఆఖరి 3 బాల్స్ ధోనీకి, మొదటి 3 బాల్స్ రోహిత్ శర్మకి... హిట్ మ్యాన్ డకౌట్లపై ట్రోల్స్...

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ముగ్గురూ ముగ్గురే. లెజెండరీ బ్యాటర్లుగా టీమిండియా కెప్టెన్లుగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముగ్గురికీ హేటర్స్ కూడా ఎక్కువే. ముఖ్యంగా విరాట్ ఫ్యాన్స్‌కి రోహిత్ శర్మ, రోహిత్ ఫ్యాన్స్‌కి కోహ్లీ అస్సలు నచ్చడు... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 06 2023, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: IPL

Image credit: IPL

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్, గౌతమ్ గంభీర్‌లతో గొడవ పడడంతో అతన్ని వీర లెవెల్‌లో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కొందరు రోహిత్ శర్మ ఫ్యాన్స్. చిన్న పిల్లలు కూడా కోహ్లీని చూసి భయపడడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని మీమ్స్ వైరల్ చేశారు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండోసారి డకౌట్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి ట్రోల్స్‌ మెటిరీయల్ అయిపోయాడు.  పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 బంతులు ఆడి డకౌట్ అయిన రోహిత్ శర్మ, సీఎస్‌కేతో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు...

36

అయినా కూడా లక్ మారలేదు. దీపక్ చాహార్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాట్‌కి ప్రయత్నించిన రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ సరిగ్గా 3 బంతులే ఆడి డకౌట్ అయ్యాడు..

46

మహేంద్ర సింగ్ ధోనీ, ఆఖరి 3 బంతులు ఆడి ఒకటి రెండు సిక్సర్లు కొడుతుంటే, రోహిత్ శర్మ మొదటి 3 బంతులు ఆడి డకౌట్ అవుతున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు... గత సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన రోహిత్, ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అర్ధ శతకం అందుకున్నా ఫామ్‌ని మాత్రం కొనసాగించలేకపోయాడు..

56
Rohit Sharma Ducks

Rohit Sharma Ducks

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 3 పరుగులు చేసిన రోహిత్ శర్మ, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 2 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 10 బంతులాడి 1 పరుగు చేశాడు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ బ్యాటు నుంచి రెండు సున్నాలు, 1, 2, 3 పరుగులు రావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి.. 

66

గత సీజన్‌లో కూడా రోహిత్ శర్మ పేలవ ఫామ్, ముంబై ఇండియన్స్‌ని తీవ్రంగా ఇబ్బందిపెట్టింది. ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈసారి కూడా ప్లేఆఫ్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
రోహిత్ శర్మ
Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved