- Home
- Sports
- Cricket
- ఆఖరి మ్యాచ్‌కి ముందే కేకేఆర్ అవుట్! లక్నోని ఓడించినా... కోల్‌కత్తా ప్లేఆఫ్స్ చేరాలంటే...
ఆఖరి మ్యాచ్‌కి ముందే కేకేఆర్ అవుట్! లక్నోని ఓడించినా... కోల్‌కత్తా ప్లేఆఫ్స్ చేరాలంటే...
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు, చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు టైటిల్ గెలిస్తే, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రెండు టైటిల్స్ ఉన్నాయి. 2021 సీజన్‌లో ఊహించని విధంగా ఫైనల్ చేరిన కేకేఆర్, ఈసారి ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది...

Image credit: PTI
సీజన్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో డీఎల్‌ఎస్ విధానంలో ఓడిన కేకేఆర్, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ సునామీ హాఫ్ సెంచరీ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా ఘన విజయాలు సాధించింది...
Image credit: PTI
సూపర్ స్ట్రాంగ్ టీమ్‌గా కనిపించింది. అయితే ఆ తర్వాత వరుస పరాజయాలు అందుకున్న కేకేఆర్, 13 మ్యాచుల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కేకేఆర్ నెట్ రన్ రేటు -0.256గా ఉంది... ఇప్పుడున్న పరిస్థితుల్లో కేకేఆర్, ప్లేఆఫ్స్ చేరాలంటే అద్భుతం జరిగి తీరాల్సిందే...
Image credit: PTI
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 103 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. లేదా లక్నో విధించిన లక్ష్యాన్ని 9 ఓవర్లలోనే ఛేదించాలి. అప్పుడు కేకేఆర్ నెట్ రన్ రేట్ ఆర్‌సీబీ, ముంబైలను దాటుతుంది..
Image credit: PTI
అంత భారీ విజయం సాధించినా ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచుల్లో గెలిస్తే కేకేఆర్ ప్లేఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్, లక్నోని ఓడిస్తే అది ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీలకు అనుకూలంగా మారుతుంది..
ఆఖరి లీగ్ మ్యాచుల్లో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ గెలిస్తే చెరో 16 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు 15 పాయింట్లతో ఉన్న సీఎస్‌కే, ఆఖరి మ్యాచ్‌లో ఢిల్లీ చేతుల్లో ఓడినా.. 15 పాయింట్లతోనే ఉన్న లక్నో సూపర్ జెయింట్స్, కేకేఆర్ చేతుల్లో ఓడినా పాయింట్ల పట్టికలో కిందకి పడిపోవాల్సి వస్తుంది...
Image credit: PTI
అలా జరిగితే నెట్ రన్ రేట్ ఆధారంగా ఆర్‌సీబీ లేదా ముంబై ఇండియన్స్... గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడే ఛాన్స్ కొట్టేస్తాయి. ఒకవేళ సీఎస్‌కే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడిస్తే నేరుగా మొదటి క్వాలిఫైయర్ ఆడుతుంది.
Image credit: PTI
అప్పుడు కూడా ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ చివరి మ్యాచుల్లో గెలిస్తే... కేకేఆర్ విజయం ఈ రెండు జట్లకు బాగా ఉపయోగపడుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
అలాకాకుండా లక్నో సూపర్ జెయింట్స్, ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్‌ని ఓడిస్తే 17 పాయింట్లకు చేరుకుంటుంది. సీఎస్‌కే కూడా చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడిస్తే... ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచుల్లో గెలిచినా రెండింట్లో నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న ఒకే ఒక్క టీమ్ ప్లేఆఫ్స్ చేరుతుంది.