MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన కెఎల్ రాహుల్... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా...

ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన కెఎల్ రాహుల్... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా...

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి ఊహించని షాక్ తగిలింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 04 2023, 11:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హర్మ్‌స్టింగ్ గాయంతో బాధపడుతున్న కెఎల్ రాహుల్, పూర్తిగా కోలుకోవడానికి నాలుగు వారాల నుంచి 5 వారాల సమయం పడుతుందని వైద్యులు నిర్ధారించినట్టు సమచారం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
KL Rahul

KL Rahul

దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు ఆ తర్వాత 10 రోజులకు జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా కెఎల్ రాహుల్ ఆడడం అనుమానమే.. 

38

ఆర్‌సీబీతో లక్నోలో జరిగిన మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో ఫాఫ్ డుప్లిసిస్ కొట్టిన ఫోర్‌ని ఆపేందుకు ప్రయత్నించిన కెఎల్ రాహుల్, తొడ కండరాలు పట్టుకోవడంతో కిందపడిపోయాడు. లేచి నడవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు కెఎల్ రాహుల్...

48

ఫిజియో సాయంతో క్రీజు వీడిన కెఎల్ రాహుల్, 9వ వికెట్ పడిన తర్వాత ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు. అయితే తొడ కండరాలు పట్టేయడంతో సింగిల్ తీయడానికి కూడా ఇబ్బంది పడిన కెఎల్ రాహుల్, 3 బంతులు ఆడినా పరుగులేమీ చేయలేకపోయాడు.
 

58

కెఎల్ రాహుల్ ఆడకపోతే లక్నో సూపర్ జెయింట్స్‌కి వచ్చిన పెద్ద ప్రమాదమేమీ లేదు. రాహుల్ టెస్టు బ్యాటింగ్‌తో ప్రేక్షకులను విసిగిస్తూ, ప్రత్యర్థి టీమ్‌కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అతని గాయం లక్నోని దెబ్బ తీయకపోయా, మరో హిట్టర్‌ని ఆడించేందుకు ఉపయోగపడొచ్చు...

68
KL Rahul

KL Rahul

అది పక్కనబెడితే కెఎల్ రాహుల్ కూడా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌లో కూర్చున్నాడు..

78
KL Rahul

KL Rahul

ప్రాక్టీస్ లేని శ్రీకర్ భరత్ కంటే టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న కెఎల్ రాహుల్‌ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ఫైనల్‌లో మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని భావించింది టీమిండియా. అతని గాయం, ఆ ప్లాన్స్‌ని మార్చేయొచ్చు.

88

ఇదే మ్యాచ్‌ ఆరంభానికి ముందు నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ జారపడి భుజానికి గాయం చేసుకున్న జయ్‌దేవ్ ఉనద్కట్ గురించి ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కెఎల్ రాహుల్ గాయంతో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌కి కృనాల్ పాండ్యా కెప్టెన్సీ చేశాడు. అతనే మిగిలిన సీజన్‌కి కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది.  

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Recommended image2
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image3
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved