- Home
- Sports
- Cricket
- విరాట్ ఆరేళ్లు కెప్టెన్సీ చేసినా... రోహిత్ శర్మ ఆ విషయంలో స్మార్ట్, ధోనీ అయితే! - కెఎల్ రాహుల్
విరాట్ ఆరేళ్లు కెప్టెన్సీ చేసినా... రోహిత్ శర్మ ఆ విషయంలో స్మార్ట్, ధోనీ అయితే! - కెఎల్ రాహుల్
2022 ఏడాదిని టెస్టు కెప్టెన్‌గా మొదలెట్టిన కెఎల్ రాహుల్, 2023 మార్చిలో టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయాడు. నాలుగేళ్లుగా గాయాలతో బాధపడుతూ తరుచూ క్రికెట్‌కి దూరమవుతున్న రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలో టీమ్‌కి దూరమయ్యాడు...

ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్ మిగిలిన మ్యాచులతో పాటు వచ్చే నెలలో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కూడా దూరమయ్యాడు. తాజాగా ‘ది రణ్‌వీర్ షో’లో పాల్గొన్న కెఎల్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
‘నేను గొప్ప లీడర్ల కెప్టెన్సీలో ఆడాను. ముందుగా ఎం.ఎస. ధోనీ. ఆయన నా కెప్టెన్, నా మొదటి కెప్టెన్. ధోనీ ఆడుతుంటే టీమ్‌కి ఎవరు కెప్టెన్ ఉన్నా, టీమ్‌ని నడిపించేది ఆయనే. ధోనీ కామ్‌గా ఉంటూ, టీమ్‌ని ఎలా నడిపిస్తారో చూశాను...
క్రీజు బయట ప్రతీ ప్లేయర్‌తో ఓ మంచి రిలేషన్‌షిప్ పెంచుకోవడానికి ధోనీ ప్రయత్నించాడు. అలా ఓ బంధం ఏర్పడితే మన కోసం ఈ కుర్రాళ్లు ఎంతటి యుద్ధమైనా చేస్తారు, మనకోసం ఎంత కష్టంలో అయినా నిలబడతారు. ధోనీ నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవి..
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో దాదాపు ఆరేడు ఏళ్లు, టీమిండియాకి కెప్టెన్సీ చేశాడు. ఆయన గణాంకాలు అసాధారణం. అంకిత భావం, దూకుడు... వేరే లెవెల్. కోహ్లీ ఎప్పుడూ ముందుండి నడిపించాలని అనుకుంటాడు...
virat kohli kl rahul
గొప్ప ప్లేయర్లుగా ఎలా మారాలో విరాట్ కోహ్లీ ఆటను చూస్తే అర్థం అవుతుంది. కోహ్లీని చూసి చాలా స్ఫూర్తి పొందాం, మెరుగ్గా ఆడేందుకు అన్ని విధాలా ప్రయత్నించాం. ఫిట్‌నెస్ విషయంలో, డైట్ విషయంలో విరాట్ కోహ్లీ చాలా పక్కగా ఉంటాడు. టీమ్‌లోని అందరూ తనలా ఉండేలా జాగ్రత్త పడతాడు...
Rohit Sharma-KL Rahul
రోహిత్ శర్మ చాలా చురుకైన కెప్టెన్. లీడర్‌గా అతని వ్యూహ్యాలు ఊహకు అందకుండా ఉంటాయి. ప్రతీ గేమ్‌కి ముందు రోహిత్ చాలా హోమ్‌వర్క్ చేస్తాడు. ప్రతీ ప్లేయర్ బలం, బలహీనత గురించి రోహిత్‌కి బాగా తెలుసు..
ఏ ప్లేయర్‌ని ఎలా అటాక్ చేయాలి, ఎలా అవుట్ చేయాలి, అతని టెక్నిక్‌లో లోపం ఏంటో కూడా రోహిత్ శర్మ చెబుతాడు. గణాంకాలు, గేమ్‌ని అర్థం చేసుకోవడంలో రోహిత్ శర్మ వేరే లెవెల్. ఈ ముగ్గురు కెప్టెన్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్..