MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • ఆ లెక్కన పంజాబ్ కింగ్స్ నెక్ట్స్ కెప్టెన్ అతనే... రాహుల్, మయాంక్, ధావన్ నుంచి వస్తున్న ఆచారం...

ఆ లెక్కన పంజాబ్ కింగ్స్ నెక్ట్స్ కెప్టెన్ అతనే... రాహుల్, మయాంక్, ధావన్ నుంచి వస్తున్న ఆచారం...

15 సీజన్లుగా ఐపీఎల్ టైటల్ గెలవడం లేదని అందరూ ఆర్‌సీబీని టార్గెట్ చేయడం వల్ల తెలియడం లేదు కానీ పంజాబ్ కింగ్స్ రూటే సెపరేటు... ఐపీఎల్‌లో ఎక్కువ మంది కెప్టెన్లను వాడిన టీమ్ పంజాబ్ కింగ్స్. వాడడం అంటే అలా ఇలా కాదు, సగటున ప్రతీ సీజన్‌కి ఓ కొత్త కెప్టెన్‌ని మార్చింది పంజాబ్ కింగ్స్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 16 2023, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: PTI

Image credit: PTI

ఇప్పటిదాకా 15 సీజన్లు జరిగితే 14 మంది కెప్టెన్లను మార్చింది పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్. 2023 సీజన్‌లోనూ కొత్త కెప్టెన్‌తో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్, వచ్చే సీజన్‌లో కెప్టెన్ ఎవరనే విషయంపై కూడా హింట్ ఇచ్చేసింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
(PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000356B)

(PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000356B)

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతని స్థానంలో ఇంగ్లాండ్ కుర్ర ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్‌, తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పంజాబ్‌కి మంచి కమ్‌బ్యాక్ విజయాన్ని అందించాడు..

37

గత మూడు సీజన్లుగా వస్తున్న ఆనవాయితీ, ఈసారి కూడా కొనసాగితే పంజాబ్ కింగ్స్ నెక్ట్స్ కెప్టెన్ సామ్ కుర్రానే. ఎందుకంటే 2021 సీజన్‌లో కెఎల్ రాహుల్ కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడంతో ఓ మ్యాచ్‌కి మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు..

47

ఆ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 99 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో కెఎల్ రాహుల్, లక్నోకి వెళ్లిపోవడంతో వన్ నైట్ స్టాండ్ ఇన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌కి పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది టీమ్ మేనేజ్‌మెంట్..

57
(PTI Photo) (PTI04_09_2023_000374B)

(PTI Photo) (PTI04_09_2023_000374B)

2022 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఓ మ్యాచ్‌లో గాయం కారణంగా మయాంక్ అగర్వాల్ బరిలో దిగకపోవడంతో అతని స్థానంలో శిఖర్ ధావన్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు...  2023 సీజన్‌లో మయాంక్ అగర్వాల్‌ని బయటికి పంపించి, శిఖర్ ధావన్‌కి కెప్టెన్సీ అప్పగించింది పంజాబ్ కింగ్స్...

67
Sam Curran

Sam Curran

వరుసగా మూడు సీజన్లలో కెప్టెన్ గాయపడడం, ఆ మ్యాచ్‌కి కెప్టెన్ చేసిన టెంపరరీ కెప్టెన్, ఆ తర్వాతి సీజన్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారడం జరుగుతూ వస్తోంది. ఆ లెక్కన పంజాబ్ కింగ్స్ తర్వాతి కెప్టెన్ సామ్ కుర్రానేనని ఫిక్స్ అయిపోతున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

77

2019లో రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచి వరుసగా ఆరో స్థానంలోనే కొనసాగుతూ ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చూపిస్తోంది పంజాబ్ కింగ్స్. అశ్విన్, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్... ఇలా కెప్టెన్లు మారినా పంజాబ్ కింగ్స్ పొజిషన్ మాత్రం మారలేదు. మరి శిఖర్ ధావన్, పంజాబ్ రాతను మారుస్తాడో లేదో చూడాలి.. 
 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved