- Home
- Sports
- Cricket
- రూ.18 కోట్లు తీసుకుంటున్నాడని, ప్రాణం పెట్టి ఆడలేడుగా... సామ్ కుర్రాన్‌పై మహ్మద్ కైఫ్ కామెంట్స్...
రూ.18 కోట్లు తీసుకుంటున్నాడని, ప్రాణం పెట్టి ఆడలేడుగా... సామ్ కుర్రాన్‌పై మహ్మద్ కైఫ్ కామెంట్స్...
ఐపీఎల్ 2023 సీజన్‌లోనే కాదు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కుర్రాన్. ఈ ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ కోసం రూ.18 కోట్ల 50 లక్షలు ఖర్చు పెట్టింది పంజాబ్ కింగ్స్...

Image credit: PTI
ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా నిలిచిన సామ్ కుర్రాన్, 2023 సీజన్‌లో అందులో సగం పర్ఫామెన్స్ కూడా ఇవ్వలేకపోతున్నాడు. 13 మ్యాచుల్లో కలిపి 9 వికెట్లు తీసిన సామ్, బ్యాటింగ్‌లో 227 పరుగులు చేశాడు...
ఈ సీజన్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదిన సామ్ కుర్రాన్, 10.11 ఎకానమీతో పరుగులు సమర్పిస్తున్నాడు. సామ్ కుర్రాన్ తీసుకుంటున్న మొత్తం 10 శాతం కూడా లేని ప్లేయర్లు, 2023 సీజన్‌లో బెటర్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు...
‘ప్రైస్ ట్యాగ్‌తో ప్లేయర్ పర్ఫామెన్స్‌ని లెక్కించడం కరెక్ట్ కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో సామ్ ఇచ్చిన పర్ఫామెన్స్ వల్ల అతనిపై భారీగా ఖర్చు చేసింది పంజాబ్ కింగ్స్. రూ.18 కోట్లు ఇస్తున్నారని ప్రాణాలు పెట్టి ఆడమంటే ఎలా?
Sam Curran
ఏ ప్లేయర్ కూడా నాకు ఇంత కావాలని అడగడు? వారి పర్ఫామెన్స్‌ని బట్టి, ఫ్రాంఛైజీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. అందులో వారి తప్పు ఏముంది? ఇంటర్నేషనల్, ఐపీఎల్ రెండూ ఒక్కటి కావు...
Image credit: PTI
పంజాబ్ కింగ్స్‌తో వచ్చిన సమస్య ఏంటంటే కగిసో రబాడా వంటి స్టార్ బౌలర్‌ని సరిగ్గా వాడుకోవడం కూడా ఆ టీమ్‌కి తెలియడం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...