- Home
- Sports
- Cricket
- ఆసియా కప్ క్యాన్సిల్ అయితే, పాక్‌కి దిమ్మతిరిగే రేంజ్‌లో మెగా టోర్నీ... బీసీసీఐ మాస్టర్ ప్లాన్!...
ఆసియా కప్ క్యాన్సిల్ అయితే, పాక్‌కి దిమ్మతిరిగే రేంజ్‌లో మెగా టోర్నీ... బీసీసీఐ మాస్టర్ ప్లాన్!...
ఆసియా కప్ 2023 టోర్నీ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. షెడ్యూల్ ప్రకారం పాక్‌లో జరగాల్సిన ఆసియా కప్ టోర్నీ, తాత్కాలిక వేదికపై నిర్వహించాలని బీసీసీఐ పట్టుబడుతోంది. పీసీబీ కూడా ఆసియా కప్ టోర్నీని పాక్ నుంచి తరలించడానికి ఒప్పుకోవడం లేదు...

ఆసియా కప్ 2023 టోర్నీని పాక్‌లో, యూఏఈలో కలిపి నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. భారత జట్టు ఆడే మ్యాచులన్నీ యూఏఈలో జరిగితే మిగిలిన మ్యాచులు, పాకిస్తాన్‌లో జరుగుతాయి. అయితే ఇలా నిర్వహించడం వల్ల పాక్‌కి ఇబ్బంది లేకపోయినా మిగిలిన టీమ్స్‌కి ఇబ్బంది కలుగుతుంది..
ఓ మ్యాచ్ పాకిస్తాన్‌లో ఆడి, మరో మ్యాచ్ కోసం మళ్లీ యూఏఈకి వెళ్లాల్సి ఉంటుంది. అటు ఇటు తిరగడంతోనే పుణ్యకాలం గడిచిపోతుంది. ఒకవేళ ఇండియా, పాకిస్తాన్ ఫైనల్‌కి వస్తే ఎక్కడ నిర్వహించాలనేది కూడా క్లారిటీ రాలేదు...
‘ఆసియా కప్ 2023 వేదికను ఖరారు చేసేందుకు మిగిలిన దేశాల ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాం. ఇండియా- పాకిస్తాన్‌పై మ్యాచ్‌పై ఓ క్లారిటీ త్వరలోనే రానుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఏషియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జై షా..
ఆసియా కప్ 2023 టోర్నీ రద్దయితే ఆ స్థానంలో ఐదు దేశాలతో కలిపి ఓ మల్లీనేషన్ సిరీస్ నిర్వహించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది టీమిండియా. బీసీసీఐ తలుచుకుంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్ కూడా సిరీస్ ఆడేందుకు రెఢీగా ఉంటాయి.
ఇండియాలో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి ముందు వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్ 2023 టోర్నీ, ప్రపంచ కప్‌కి ప్రాక్టీస్‌గా కూడా ఉంటుంది.
ఆసియా కప్ 2023 టోర్నీ క్యాన్సిల్ అయితే ఆ ప్రభావం పాక్‌లో 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీపై పడుతుంది. ఆ టోర్నీ కూడా పాక్ నుంచి తరలించాల్సిందేనని బీసీసీఐ పట్టుబడుతోంది..