- Home
- Sports
- Cricket
- శ్రేయాస్ అయ్యర్ కంటే నీ కెప్టెన్సీ బాగుంది!కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాతో షారుక్ ఖాన్...
శ్రేయాస్ అయ్యర్ కంటే నీ కెప్టెన్సీ బాగుంది!కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాతో షారుక్ ఖాన్...
అన్నీ సక్రమంగా జరిగి ఉంటే, శ్రేయాస్ అయ్యర్ ఈపాటికి టీమిండియా కెప్టెన్ అయ్యుండేవాడు. అయితే 2021 మార్చి నెలలో శ్రేయాస్ అయ్యర్ గాయపడడం అతని కెరీర్‌ని తలకిందులు చేసేసింది...

గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ ఫేజ్‌కి దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్. ఈ టైమ్‌లో రిషబ్ పంత్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి, మేనేజ్‌మెంట్‌ని ఇంప్రెస్ చేసేశాడు...
రిషబ్ పంత్ దెబ్బకు 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఫైనల్ చేర్చిన శ్రేయాస్ అయ్యర్, 2022 సీజన్‌లో టీమ్ మారాల్సి వచ్చింది. 2022 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా పెద్దగా మార్కులు తెచ్చుకోలేకపోయాడు..
Image credit: PTI
2023 సీజన్ ఆరంభానికి ముందు మరోసారి పగాయపడ్డాడు శ్రేయాస్ అయ్యర్. అయ్యర్ దూరం కావడంతో అతని ప్లేస్‌లో నితీశ్ రాణాని కెప్టెన్‌గా ఎంచుకుంది కోల్‌కత్తా నైట్ రైడర్స్...
Image credit: PTI
గత సీజన్‌లో అయ్యర్ కెప్టెన్సీలో అట్టర్ ఫ్లాప్ అయిన వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, ఈసారి నితీశ్ రాణా కెప్టెన్సీలో బాధ్యతాయుతంగా ఆడుతున్నారు.. రాణా కూడా కెప్టెన్ అయ్యాక బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు..
‘పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కి ముందు షారుక్ కాన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆయన నా కెప్టెన్సీని చాలా మెచ్చుకున్నారు. నా కెప్టెన్సీ చాలా బాగుందని అన్నారు...
PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000479B)
నీ సత్తాని నువ్వు ఎప్పుడూ తక్కువ చేసి చూసుకోకు. నీవు బాగా ఆడితే కేకేఆర్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. నీకు అనిపించింది చెయ్, నీ వెనక నేనున్నా.. అన్నారు. ఆ మాటు నాలో ధైర్యం నింపాయి..’ అంటూ కామెంట్ చేశాడు నితీశ్ రాణా..
పొరపాటున నితీశ్ రాణా కెప్టెన్సీలో కేకేఆర్, గత సీజన్ కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తే... శ్రేయాస్ అయ్యర్ మరోసారి కెప్టెన్సీ కోల్పోక తప్పదు. కోల్‌కత్తా ప్లేఆఫ్స్ చేరకూడదని అయ్యర్ కోరుకుంటే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్.