- Home
- Sports
- Cricket
- మొదటి ఓవర్‌లో 26 పరుగులు ఇచ్చేసిన నితీశ్ రాణా... అయినా ఎవరి మాటా విననంటున్న కేకేఆర్ కెప్టెన్...
మొదటి ఓవర్‌లో 26 పరుగులు ఇచ్చేసిన నితీశ్ రాణా... అయినా ఎవరి మాటా విననంటున్న కేకేఆర్ కెప్టెన్...
ఐపీఎల్ 2023 సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ పాల్గొనకపోవడంతో కెప్టెన్సీ చేసే మహత్తర అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు నితీశ్ రాణా. కొన్ని మ్యాచుల్లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చిన కేకేఆర్, మరికొన్ని మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అవుతోంది...

(PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000479B)
ప్లేఆఫ్స్ ఛాన్సులు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో 9 వికెట్ల తేడాతో ఓడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 6.5 ఓవర్లు ఉండగానే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ని ముగించడంతో కేకేఆర్ నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది..
యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుని, ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. టీమ్‌లో హర్షిత్ రాణా, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, సుయాశ్ శర్మ వంటి బౌలర్లు ఉన్నా కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా స్వయంగా మొదటి ఓవర్ వేశాడు.
నితీశ్ రాణా వేసిన మొదటి ఓవర్‌లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో పాటు ఓ టుడీ తీసిన యశస్వి జైస్వాల్ 26 పరుగులు రాబట్టేశాడు. ఇది మ్యాచ్‌ని పూర్తిగా రాయల్స్ వైపు మార్చేసింది. ఐపీఎల్‌లో మొదటి ఓవర్‌లో వచ్చిన అత్యధిక పరుగులు ఇవే.
Image credit: PTI
ఇంతకుముందు 2011లో ఆర్‌సీబీ, ముంబైతో మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో 27 పరుగులు రాబట్టింది. అయితే ఇందులో 7 ఎక్స్‌ట్రాలు ఉన్నాయి. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన యశస్వి జైస్వాల్, ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు నెలకొల్పాడు.
వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఒకే ఫోర్ బాదాడు జైస్వాల్. కెప్టెన్ నితీశ్ రాణాకి బదులుగా వరుణ్ చక్రవర్తి తొలి ఓవర్ వేసినా, మ్యాచ్ కాస్త ఎక్కువ సేపు సాగి ఉండేది..
ఇది 180+ పరుగుల పిచ్. దీనిపై మేం చేసిన స్కోరు సరిపోదు. జైస్వాల్‌ని అవుట్ చేయడానికి ఓ పార్ట్ టైమ్ స్పిన్నర్ అయితే బాగుంటుందని అనుకుంటే అదే మా ప్లాన్‌ని దెబ్బ తీసింది. నా బౌలింగ్‌లో తప్పు లేదు, అతను అద్భుతంగా ఆడినప్పుడు ఇలాంటివి సహజం’ అంటూ కామెంట్ చేశాడు నితీశ్ రాణా..
Yashasvi Jaiswal
‘నితీశ్ రాణా తన కెరీర్‌లో ఎన్నో కీలక వికెట్లు తీశాడు. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను అవుట్ చేశాడు. అందుకే తానే స్వయంగా బౌలింగ్ చేయాలని అనుకున్నాడు.
అతను మొదటి ఓవర్‌లో వికెట్ తీసి ఉంటే రాజస్థాన్ రాయల్స్‌కి మాస్టర్ స్టోక్ అయ్యి ఉండేది. అయితే జైస్వాల్ ఫుల్లు స్వింగ్‌లో ఉన్నప్పుడు ఏ బౌలర్ అయినా బలి కాక తప్పదు..’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్..