- Home
- Sports
- Cricket
- నా కొడుకు కోసమే ఐపీఎల్ ఆడుతున్నా! ప్రతీ మ్యాచ్ తర్వాత... పియూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
నా కొడుకు కోసమే ఐపీఎల్ ఆడుతున్నా! ప్రతీ మ్యాచ్ తర్వాత... పియూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో అమ్ముడుపోని పియూష్ చావ్లాని ముంబై ఇండియన్స్, 2023 సీజన్ మినీ వేలంలో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. జస్ప్రిత్ బుమ్రా గాయంతో టీమ్‌కి దూరం కావడం, జోఫ్రా ఆర్చర్ కూడా అదే బాట పట్టడంతో ముంబై ఇండియన్స్‌కి కీ బౌలర్‌గా మారిపోయాడు పియూష్ చావ్లా...

Image credit: PTI
ఐపీఎల్ 2023 సీజన్‌లో 12 మ్యాచుల్లో 19 వికెట్లు తీసిన పియూష్ చావ్లా, 7.6 ఎకానమీతో బౌలింగ్ చేస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 3లో నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 కీలక వికెట్లు తీసిన పియూష్ చావ్లా, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
‘నిజానికి నేను నా కొడుకు కోసం ఐపీఎల్ ఆడుతున్నా. అతను నేను ఆడడం ఎప్పుడూ చూడలేదు. నేను ప్రైమ్ ఫామ్‌లో ఉన్నప్పుడు వాడు చాలా చిన్నపిల్లాడు. ఇప్పుడు తను గేమ్‌ని అర్థం చేసుకోగలుగుతున్నాడు..
(PTI Photo/Shashank Parade)(PTI04_30_2023_000354B)
వాడికి ఇప్పుడు ఆరేళ్లే కానీ క్రికెట్ గురించి చాలా విషయాలు తెలుసు. అందుకే వాడి ముందు హీరోగా ఉండాలనే బాగా కష్టపడుతున్నా. ప్రతీ మ్యాచ్ పూర్తయిన తర్వాత మేం ఇద్దరం కూర్చొని విశ్లేషించుకుంటాం..
అతను నా బౌలింగ్‌ని రివ్యూ చేస్తాడు. ఏ బ్యాటర్‌కి ఎలా వేసి ఉంటే బాగుంటుందో చెబుతాడు. అవన్నీ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా. అయితే వాడిని బౌలర్‌గా చూడాలనుకోవడం లేదు..
నాలాగా బౌలర్ అయితే ఏం వస్తుంది, బ్యాటర్ అయితే ప్రపంచమంతా హీరోలా చూస్తారు. అందుకే వాడికి నేను రోజూ బ్యాటింగ్ శిక్షణ ఇస్తున్నా. నెట్స్‌లో నేనే బౌలింగ్ చేస్తున్నా...
భవిష్యత్తులో నా కొడుకు మంచి బ్యాటర్‌గా మారతారని అనుకుంటున్నా. అదే జరిగితే వాడి కోసం రూ.20 కోట్లు అయినా ఇస్తారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌కి అంత డబ్బు రెఢీగా పెట్టుకోమని చెప్పి ఉంచా...’ అంటూ కామెంట్ చేశాడు పియూష్ చావ్లా..