- Home
- Sports
- Cricket
- నేను కోహ్లీ ఆటకు వీరాభిమానిని కానీ అతని సెలబ్రేషన్స్‌కి కాదు! పిల్లలు చూస్తున్నారు... - రాబిన్ ఊతప్ప
నేను కోహ్లీ ఆటకు వీరాభిమానిని కానీ అతని సెలబ్రేషన్స్‌కి కాదు! పిల్లలు చూస్తున్నారు... - రాబిన్ ఊతప్ప
విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతనికి ఇంతటి ఫాలోయింగ్ రావడానికి తన యాటిట్యూడే ఓ కారణం. ఈ యాటిట్యూడ్ కారణంగానే విరాట్ కోహ్లీ అంటే పడని వారి సంఖ్య కూడా కోట్లలో ఉంటుంది..

Kohli vs Gambhir
లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రవర్తన హాట్ టాపిక్ అయ్యింది. అసలు గొడవ ఎక్కడ మొదలైంది. ఎవరిది తప్పు? నవీన్ వుల్ హక్‌దా? లేక విరాట్ కోహ్లీదా? లేక గౌతమ్ గంభీర్‌దా? అనేది పక్కనబెడితే విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్‌ని ‘నువ్వు నా కాలి దూళితో సమానం’ అంటూ అనడం వివాదాస్పదమైంది.
Mayers and Kohli
‘మ్యాచ్ సమయంలో ప్రతీ ప్లేయర్‌లో ఎన్నో ఎమోషన్స్ పుడతాయి. అయితే ప్రతీ ఎమోషన్‌ని బయటికి చూపించడం కరెక్ట్ కాదు. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం? ఎంత మంది మనల్ని చూస్తున్నారనే విషయాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడే మాట, నడిచే విధానం కరెక్టుగా ఉండేలా చూసుకోవాలి..
Gambhir-Kohli
అక్కడ ఏం జరిగింది, ఎవరు తప్పు చేశారనేది నాకు తెలీదు. అయితే ఐపీఎల్‌లో ఇలాంటి సీన్స్ కరెక్ట్ కాదు. గేమ్‌లో ఏం జరిగినా ప్రత్యర్థిని గౌరవించాలి. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్స్ ఇవ్వాలి. నీ అహాన్ని పక్కనబెట్టి గేమ్‌ని గౌరవించాలి..
Virat Kohli-Naveen Ul Haq Fight
ఎందుకంటే ఆటగాళ్లకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఆటకు గౌరవం ఇవ్వాలి. ఎవరు ఏం మాట్లాడారు? ఏమేం తిట్టుకున్నారనేది నాకు తెలీదు. అయితే ఇలాంటివన్నీ క్రికెట్ ఫీల్డ్‌లోకి రాకూడదు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ గొడవ అస్సలు కరెక్ట్ కాదు...
విరాట్ కోహ్లీ ఆటకు నేను వీరాభిమానిని అయితే అతని సెలబ్రేషన్స్‌కి కాదు. అతను 21 ఏళ్ల కుర్రాడు కాదు. ఇలాంటి ప్రవర్తన ఊహించలేదు. ఎంతో మంది కుర్రాళ్లు చూస్తున్నారు. వారికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి, ఇలా చేయడం నాకు నచ్చలేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప...