- Home
- Sports
- Cricket
- ఆయనే నా మెంటర్! భారత జెర్సీ వేసుకుంటానని అనుకోలేదు... విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..
ఆయనే నా మెంటర్! భారత జెర్సీ వేసుకుంటానని అనుకోలేదు... విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..
టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఐపీఎల్‌లో 16 సీజన్లుగా ఒకే ఫ్రాంఛైజీకి ఆడుతున్న ఏకైక ప్లేయర్‌గా నిలిచిన విరాట్, తన కోచ్ రాజ్‌కుమార్ శర్మ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు...

ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కి ముందు తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మను కలిసిన విరాట్ కోహ్లీ, ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది..
PTI Photo/Ravi Choudhary) (PTI05_06_2023_000496B)
‘కొందరు ఆటలకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వరు, అందుకే మొదటి రోజు నుంచి మనల్ని నమ్మి ప్రోత్సహించినవారికి గుర్తుచేసుకోవడం చాలా అవసరం. నేనెప్పుడూ రాజ్‌కుమార్ సర్‌కి రుణపడి ఉంటాను...
Image credit: PTI
ఆయన నాకు కోచ్ మాత్రమే కాదు, మెంటర్ కూడా. నా ఈ జర్నీలో ఆయన ఎల్లవేళలా నాకు అండగా నిలిచాడు. నేను కుర్రాడిగా ఉన్నప్పుడే టీమిండియాకి ఆడాలనుకున్నా..
Virat kohli With Childhood coach Rajkumar Sharma
అయితే నా జీవితంలో భారత జెర్సీ వేసుకుంటానని అనుకోలేదు. ఆ కలను 15 ఏళ్ల క్రితం నిజం చేసింది మాత్రం నా మీద నాకున్న నమ్మకమే. అలాంటి నమ్మకాన్ని నాలో కలిగించినందుకు రాజ్‌కుమార్‌సర్‌కి అన్ని వేళలా కృతజ్ఞుడిని.
ఆయన ఇచ్చిన ప్రతీ సలహా, ప్రతీ పాఠం, ప్రతీ సూచన, నా భుజన్ని తట్టిన ప్రతీ స్పర్శ, నా తలపై వేసిన ప్రతీ దెబ్బ... నా కలను ఆయన కలగా భావించినకు ఆయనకు థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పగలను..
Rajkumar Sharma
ఇది నా కోచ్ కథ. మీ కథలను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా. మీ జీవితంలో మిమ్మల్ని ప్రోత్సహించిన ఓ వ్యక్తిని, అది మీ స్నేహితుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, కోచ్ కావచ్చు మరెవరైనా కావచ్చు...
వారి కథను మాతో పంచుకోండి.. #LetThereBeSport ట్యాగ్‌తో షేర్ చేయడం, పూమా అందించే బహుమతులు గెలుచుకోండి’ అంటూ ఓ ప్రమోషన్ పోస్ట్‌కి ఎమోషన్ జోడించి పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ..
ఇన్‌స్టాగ్రామ్‌లో 248 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ, ఒక్కో ప్రమోషన్ పోస్టు ద్వారా రూ.8 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు.