- Home
- Sports
- Cricket
- ఎడమ చేత్తో కొడితే వరల్డ్ రికార్డు ఎగిరి పడాలి... యువరాజ్, క్రిస్ గేల్, యశస్వి జైస్వాల్...
ఎడమ చేత్తో కొడితే వరల్డ్ రికార్డు ఎగిరి పడాలి... యువరాజ్, క్రిస్ గేల్, యశస్వి జైస్వాల్...
కుడి చేతి వాటం వాళ్లకంటే ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ల బుర్ర కాస్త చురుగ్గా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. అంటే రైట్ హ్యాండ్ కొట్టే వారి కంటే లెఫ్ట్ హ్యాండ్‌తో కొడితే ఆ దెబ్బ గట్టిగా తగులుతుంది. దీన్ని మరోసారి రుజువు చేశాడు యశస్వి జైస్వాల్...

Image credit: PTI
2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు కెఎల్ రాహుల్. ఐదేళ్లుగా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా ఉన్న ఈ రికార్డుని ఎడమ చేత్తో తుడిచేశాడు యశస్వి జైస్వాల్...
(PTI05_11_2023_000376B)
13 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకుని, ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు యశస్వి జైస్వాల్. జైశ్వాల్ ఆడిన మొదటి 13 బంతుల్లో ఒక్క డాట్ బాల్ కూడా లేకపోవడం విశేషం...
Yuvraj Singh
అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు యువీ. 16 ఏళ్లుగా ఆ రికార్డు చెక్కచెదరకుండా అలాగే ఉంది.
బిగ్ బాష్ లీగ్‌లో 12 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు వెస్టిండీస్ బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్...
Hazratullah Zazai
అలాగే ఆఫ్ఘాన్ యంగ్ సంచలనం హజ్రతుల్లా జజాయ్, ఆఫ్ఘానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో 12 బతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
అలాగే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్, ఇంగ్లీష్ డొమెస్టిక్ టీ20 క్రికెట్‌లో 13 బంతుల్లో 5 సిక్సర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
Sunil Narine
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, బంగ్లా ప్రీమియన్ లీగ్ 2022 టోర్నీలో 13 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..
అలాగే ఆస్ట్రియాకి చెందిన మీర్జా అహ్సన్ కూడా ఐసీసీ కాంటినెంటల్ కప్ మ్యాచ్‌లో 13 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇందులో 2 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఐపీఎల్, బీపీఎల్, బీబీఎల్, ఇంటర్నేషనల్... ఇలా అన్ని టోర్నీల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన క్రికెటర్లు అంతా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే కావడం విశేషం..