MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ మొదలై వారం కాకముందే ఫ్రాంచైజీలకు గాయాల బెడద.. డజన్ మంది ఔట్..

ఐపీఎల్ మొదలై వారం కాకముందే ఫ్రాంచైజీలకు గాయాల బెడద.. డజన్ మంది ఔట్..

IPL 2023:  ఐపీఎల్ కొత్త సీజన్ మొదలై  సరిగ్గా వారం కూడా కాలేదు.  ఈ సీజన్ లో ఇదివరకు  (ప్రస్తుతం జరుగుతున్న  రాజస్తాన్ - పంజాబ్ మ్యాచ్ తో కలిపి) జరిగినవి ఆరు మ్యాచులే. 

3 Min read
Author : Srinivas M
Published : Apr 05 2023, 07:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఇండియన్ ప్రీమియర్ లీగ్  (ఐపీఎల్)  లో కొత్త సీజన్ మొదలై  నేటికి  ఐదు రోజులు. ప్రస్తుతం గువహతి వేదికగా  రాజస్తాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కలుపుకుని ఈ లీగ్ లో  జరిగిన మ్యచ్ లు  8 మాత్రమే.   కానీ వారం రోజులు కూడా కాకముందే ఈ సీజన్ లో  ఏకంగా  12 మంది గాయాల కారణంగా   తప్పుకున్నారు.  వారం రోజులకే  డజను మంది తప్పుకుంటే మరి రాబోయే రెండు నెలల్లో ఎంతమంది బాధితులవ్వాలి..? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఐపీఎల్  - 16 ఎడిషన్  మార్చి 31న మొదలైంది. ఈ లీగ్   ప్రారంభానికి  ముందే పలు ఫ్రాంచైజీలకు  ఆటగాళ్లు షాకులిచ్చారు. అలా షాకిచ్చిన వారిలో  తొలి స్థానం  ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యలర్ కెప్టెన్  రిషభ్ పంత్‌దే. గతేడాది  డిసెంబర్ 30న   రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్..   ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరమవడంతో   ఐపీఎల్ లో  గాయాల కారణంగా తొలి వికెట్ పడింది. 

39

ఈ జాబితాలో ఢిల్లీ తర్వాత  ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తాకింది.  జనవరి, ఫిబ్రవరి మొదటివారం  వరకూ  ఐపీఎల్ లో రీఎంట్రీ ఇస్తాడని ఆశించిన  బుమ్రా.. ఉన్నఫళంగా  కొంతకాలంగా వేధిస్తున్న  వెన్ను గాయానికి  శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో  అతడు  ఐపీఎల్ - 16 నుంచి తప్పుకున్నాడు. ఇది  జరగడానికి కొద్దిరోజుల ముందే ముంబై మరో పేసర్, ఆసీస్ ఆటగాడు  జై రిచర్డ్‌సన్ కూడా  గాయంతో ఈ సీజన్ కు దూరమయ్యాడు.  

49

చెన్నై   సూపర్ కింగ్స్  పేసర్  కైల్ జెమీసన్ కూడా సీజన్ ఆరంభానికి రెండు వారాల ముందే గాయంతో ఐపీఎల్ నుంచి  తప్పుకున్నాడు.  అతడి స్థానంలో  సిసంద మగల (దక్షిణాఫ్రికా) ను రిప్లేస్ చేసుకున్నా అతడింకా  జట్టుతో కలవలేదు. సరిగ్గా గుజరాత్ తో  తొలి మ్యాచ్ కు ముందు  ఆ జట్టు పేసర్ ముఖేష్ చౌదరి  కూడా   గాయం కారణంగా  తప్పుకోవాల్సి వచ్చింది. 

59

ఆర్సీబీ  ఆటగాడు విల్ జాక్స్..  ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పర్యటనలో గాయపడి ఐపీఎల్ - 16 కు దూరమయ్యాడు.   దీంతో  ఆర్సీబీ  కివీస్  ఆల్ రౌండర్  మైఖేల్ బ్రాస్‌వెల్ ను రిప్లేస్ చేసుకుంది.  ఆ తర్వాత రజత్ పాటిదార్ కూడా ఇదే బాటలో నడిచాడు.   జోష్ హెడిల్వుడ్  సీజన్ లో సగం మ్యాచ్ లకు దూరంగా ఉండనుండగా  ఆర్సీబీ.. ముంబైతో ఆడిన తొలి మ్యాచ్ లో ఆ టీమ్ పేసర్ రీస్ టాప్లీ కూడా భుజం గాయంతో  కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు. 

69

ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు కు ఆడిన  కేన్ విలియమ్సన్ గాయం కారణంగా   ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తప్పుకున్నాడు. దీంతో గుజరాత్  అతడి స్థానంలో శ్రీలంక కెప్టెన్ దసున్ శనకను టీమ్ తో చేర్చుకుంది. 

79
Image credit: PTI

Image credit: PTI

రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కీలక పేసర్ గా ఉన్న ప్రసిధ్ కృష్ణ.. ఈ సీజన్ కు ముందే   గాయం వల్ల మొత్తం సీజన్ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్ లో  ప్రసిధ్ రాజస్తాన్  రాయల్స్ కీలక విజయాల్లో భాగమయ్యాడు. 
 

89

పంజాబ్ కింగ్స్ కు మెరుపు బ్యాటర్  జానీ బెయిర్ స్టో ఐపీఎల్ ఆడేందుకు  ఈసీబీ  నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వలేదు.  దీంతో అతడు ఐపీఎల్ కు దూరం కాగా తాజాగా  ఆ జట్టు ఆల్ రౌండర్ రాజ్ బవ కూడా  ఎడమ మోచేతికి గాయం వల్ల సీజన్ నుంచి దూరమయ్యాడు. 

99
Image credit: PTI

Image credit: PTI

కోల్కతా నైట్  రౌడర్స్ కు ఈ సీజన్  లో ఏదీ కలిసిరావడం లేదు. ఈ ఎడిషన్ కు ముందే ఆ జట్టు సారథి శ్రేయాస్ అయ్యర్ గాయంతో  ఫస్టాప్ కు మాత్రమే దూరంగా ఉంటాడనుకోగా తాజాగా అయ్యర్ కు సర్జరీ అవసరమని తేలడంతో దఅతడు సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు.  కేకేఆర్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ కూడా  ఈసారి బంగ్లాదేశ్  జాతీయ జట్టు  డ్యూటీల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. 

About the Author

SM
Srinivas M
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved