పేరుకి వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు! పిచ్‌ని ఆరబెట్టేందుకు స్పాంజీలు, మట్టి... వరల్డ్ కప్‌లో ఇలా జరిగితే...
వరల్డ్‌లో రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్. కేవలం ఐపీఎల్ మీడియా రైట్స్ అమ్మకం ద్వారానే రూ.43 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది బీసీసీఐ. అయితే ఐపీఎల్ ఫైనల్‌లో కనిపించిన దృశ్యాలు, బీసీసీఐ పరువు తీసేలా ఉన్నాయి...
Chennai Super Kings v Gujarat Titans
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం కురిసింది. కాసేపటికి తిరిగి మ్యాచ్ ప్రారంభమైనా సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో 3 బంతులు పడగానే తిరిగి వాన వచ్చేసింది..
దాదాపు అరగంట పాటు కురిసిన వర్షానికి గ్రౌండ్ మొత్తం తడిసి ముద్దయ్యింది. వర్షం తగ్గిన తర్వాత పిచ్‌ని ఆటకు సిద్ధం చేసేందుకు గ్రౌండ్ సిబ్బంది తీసుకున్న సమయంలో పూర్తి ఓవర్ల పాటు మ్యాచ్ జరిగి పూర్తయ్యేది కూడా...
10 గంటల 20 నిమిషాలకు వర్షం ఆగిపోతే, పిచ్ మీద నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు గ్రౌండ్ సిబ్బంది స్పంజీలను వాడారు. స్పాంజీలతో నీళ్లను పట్టి, బకెట్లతో పిండారు. ఆ తర్వాత పిచ్‌పై ఉన్న నీటిని తొలగించేందుకు మట్టి వేశారు...
అయితే పిచ్ పూర్తిగా ఆరకపోవడంతో 10 గంటల 45 నిమిషాలకు గ్రౌండ్‌ని పర్యవేక్షించిన అంపైర్లు, ఆట కొనసాగించేందుకు వీలుగా లేదని మరో 45 నిమిషాల పాటు వేచి చూడాలని నిర్ణయం తీసుకున్నారు... మొత్తానికి 10:20కి వర్షం ఆగితే 12 గంటల 10 నిమిషాలకు ఆట తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
Chennai Super Kings v Gujarat Titans
ఈ గ్యాప్‌లో పిచ్‌ని ఆరబెట్టేందుకు ఇస్త్రీ పెట్టెలను, హెయిర్ డ్రైయర్లను వాడింది బీసీసీఐ. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాన్ని అధునాతన పద్ధతులతో తీర్చి దిద్దింది బీసీసీఐ.. ఈ స్టేడియం కోసం భారీగా ఖర్చు చేసింది..
CSK vs GT
అయితే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఈ స్టేడియం హంగుల వెనకున్న డొల్లతనం బయటపడింది. స్టేడియం పైకప్పుల నుంచి వర్షపు నీరు పడుతుండడంతో పాటు వాన నిలిచిన తర్వాత గంటన్నరకు కూడా గ్రౌండ్ ఆటకు సిద్ధం కావడం లేదంటే డ్రైనేజీ సిస్టం ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు...
ఈ గ్యాప్‌లో మరోసారి వర్షం పడితే, అప్పటిదాకా పడిన కష్టం మొత్తం వృథాయే. మెల్‌బోర్న్, సిడ్నీ వంటి స్టేడియాల్లో వర్షం పడి, ఆగితే 15 నిమిషాల్లో ఆట తిరిగి ప్రారంభం అవుతుంది.
Chennai Super Kings Fans
ఇంగ్లాండ్‌లో ఎంత భారీ వర్షం పడినా పిచ్ తడవకుండా అధునాతన కవర్లను వాడుతోంది. కానీ భారత క్రికెట్ బోర్డు కవర్లను కప్పినా, పిచ్ తడిసి ముద్దయ్యింది. మరీ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే పిచ్ మీద కప్పిన కవర్లు గాలికి ఎగిరిపోకుండా బాల్ బాయ్స్ వర్షంలో తడుస్తూ కూర్చోవాల్సి వచ్చింది. మరి వేల కోట్ల ఆదాయాన్ని గడిస్తున్న బీసీసీఐ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బోర్డుల నుంచి ఏమీ నేర్చుకోవడం లేదా?
Image credit: PTI
పేరుకి ప్రపంచ క్రికెట్‌ని శాసిస్తున్న బీసీసీఐ, స్టేడియాల నిర్వహణ విషయంలో ఎంత సీరియస్‌గా ఉందో ఈ సంఘటన ద్వారా అర్థం అవుతోందని Shameful ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు ఐపీఎల్ ఫ్యాన్స్..
Image credit: PTI
ఇప్పుడే ఇలా ఉంటో ఈ ఏడాది చివర్లో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ సమయంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రపంచ మీడియాలో ఇంకెన్ని ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్..