- Home
- Sports
- Cricket
- ఫైనల్ ఆడిన ప్రతీసారి టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా... మూడు సార్లు ఫైనల్ ఆడిన అజింకా రహానేకి...
ఫైనల్ ఆడిన ప్రతీసారి టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా... మూడు సార్లు ఫైనల్ ఆడిన అజింకా రహానేకి...
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అయ్యుండొచ్చు కానీ... హార్ధిక్ పాండ్యా, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు ఖాతాలో మాహీ కంటే ఎక్కువ ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయి. ధోనీ 11 సార్లు ఫైనల్స్ ఆడి 4 టైటిల్స్ మాత్రమే గెలిస్తే, హార్ధిక్ పాండ్యా ఫైనల్స్ ఆడిన ప్రతీసారి టైటిల్ గెలిచాడు...
- FB
- TW
- Linkdin
Follow Us
)
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా 8 సీజన్లలో 5 సార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, 2009లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. అలాగే 2015లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన హార్ధిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ తరుపున 4 టైటిల్స్ గెలిచాడు...
2015లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్న హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాత 2017, 2019 సీజన్లలో ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గాయం కారణంగా 2020 సీజన్‌లో పాండ్యా సరిగ్గా ఆడకపోయినా ఆ సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్ టైటిల్ కైవసం చేసుకుంది..
Image credit: PTI
2022 రిటెన్షన్స్‌లో తనకు చోటు దక్కకపోవడంతో హర్ట్ అయిపోయి గుజరాత్ టైటాన్స్‌లోకి వెళ్లిపోయాడు హార్ధిక్ పాండ్యా. ఏ మాత్రం అంచనాలు లేకుండా 2022 సీజన్‌ని ఆరంభించిన గుజరాత్ టైటాన్స్, పాండ్యా కెప్టెన్సీలో ఆరంగ్రేటం సీజన్‌లోనే టైటిల్ గెలిచింది...
Image credit: PTI
దీంతో ఓవరాల్‌గా ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరోసారి ఫైనల్ ఆడబోతున్నాడు హార్ధిక్ పాండ్యా. ఇంతకుముందు హార్ధిక్ పాండ్యా ఫైనల్ ఆడిన 5 సీజన్లలో తన జట్టే విజయం అందుకుంది. దీంతో ఈసారి కూడా పాండ్యా టీమ్ టైటిల్ నెగ్గాలని కోరుకుంటున్నారు అతని ఫ్యాన్స్...
మరోవైపు అత్యధిక ఫైనల్స్ ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్న మహేంద్ర సింగ్ ధోనీ, 2010లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత 2011, 2018, 2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచింది...
అజింకా రహానేకి ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్. ఇంతకుముందు 2010లో ముంబై ఇండియన్స్ తరుపున, 2017లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరుపున ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన రహానే, 2020 సీజన్‌లో తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఉన్నాడు...
Image credit: PTI
మూడు సార్లు కూడా అజింకా రహానే టీమ్‌కి ఫైనల్‌లో విజయం దక్కలేదు. 2021 సీజన్‌లో ఛతేశ్వర్ పూజారాకి ఐపీఎల్ టైటిల్ అందించిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి అజింకా రహానేకి ఆ అదృష్టం అందిస్తుందా? లేక రహానే బ్యాడ్‌లక్ కొనసాగి, సీఎస్‌కే ఓడుతుందా? కొన్ని గంటల్లో తేలిపోనుంది..