MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2023 Final: రిజర్వ్ డే‌ను కూడా వరుణుడు ముంచెత్తితే..! తాలా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

IPL 2023 Final: రిజర్వ్ డే‌ను కూడా వరుణుడు ముంచెత్తితే..! తాలా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

IPL 2023 Final CSK vs GT: ఐపీఎల్ -16 ఫైనల్ కు ఘనమైన ముగింపు లభిస్తుందనుకుంటే  అనూహ్యంగా ఆదివారం అహ్మదాబాద్‌ను వర్షం ముంచెత్తింది.

2 Min read
Author : Srinivas M
Published : May 29 2023, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: PTI

Image credit: PTI

రెండు నెలల పాటు దేశంలో లెక్కలేని క్రికెట్ వినోదాన్ని పంచుతున్న  ఇండియన్  ప్రీమియర్ లీగ్ - 16 వ ఎడిషన్ లో ముగింపును ఘనంగా చేద్దామని   భావించిన బీసీసీఐకి వరుణుడు షాకిచ్చాడు.  ఆదివారం  టాస్  వేసే సమయానికి ముందు మొదలైన వర్షం  11 గంటలైనా ఆగకపోవడంతో  అంపైర్లు మ్యాచ్ ను నేటికి వాయిదా వేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఫైనల్‌కు రిజర్వ్ డే ఉండటంతో  నేడు  అదే అహ్మదాబాద్ వేదికగా  రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది.   అయితే  వర్షం ముప్పు నిన్నటితోనే ముగిసిపోలేదు. వాతావారణ శాఖ అంచనా   ప్రకారం  సోమవారం  రాత్రి 9 తర్వాత ఇక్కడ వర్షం పడే అవకాశాలు  మెండుగా ఉన్నాయని  సూచిస్తున్నాయి. నిన్నటంత కాకపోయినా వర్షం కురవడం అయితే పక్కా అని నివేదికలు సూచిస్తున్నాయి. 

37
Image credit: PTI

Image credit: PTI

అయితే నేడు 20 ఓవర్ల మ్యాచ్ సాధ్యమవుతుందని భావిస్తున్న బీసీసీఐకి, అభిమానులకు ఇది  కాస్త  బ్యాడ్ న్యూసే. కానీ  మ్యాచ్ సజావుగా సాగేందుకు  అనువైన ఏర్పాట్లన్నీ చేసిన బీసీసీఐ.. 20 ఓవర్ల ఆట కుదరకుంటే 15, 10తో పాటు 5 ఓవర్ల మ్యాచ్ ద్వారా అయినా ఫలితం తేల్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.  అదీకాకుంటే   చివరి ప్రయత్నంగా  ‘సూపర్ ఓవర్’ ద్వారా అయినా ఫలితం నిర్ణయించే అవకాశాలున్నాయి.  

47

కానీ వరుణుడు మాత్రం  నిన్నట్లాగే అసలు  ఒక్క బంతి కూడా  వేయడానికి ఛాన్స్ ఇవ్వకుంటే ఏంటన్న అనుమానాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి.   దీనికి బీసీసీఐ అధికారుల నుంచి  వస్తున్న సమాధానం ఏంటంటే.. పాయింట్ల పట్టికలో టాప్-1లో ఉన్న జట్టును  విజేతగా ప్రకటించడం. ఈ లెక్కన చూస్తే  డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్-16 ట్రోఫీ అవుతుంది. 

57
Image credit: PTI

Image credit: PTI

లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్.. 14 మ్యాచ్ లు ఆడి  పది గెలిచి  20 పాయింట్లు సాధించి  ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్. 14 మ్యాచ్ లు ఆడి  8 గెలిచి 17 పాయింట్లతో రెండో  స్థానంలో ఉంది. ఈ లెక్కన గుజరాత్ కే ట్రోఫీ దక్కే అవకాశాలుంటాయి. 

67

కానీ బీసీసీఐ ఇలా చేస్తే సీఎస్కే, తాలా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?  అసలే ఇది ధోనికి చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో  తాలా అభిమానులంతా అతడు  ఎక్కడ మ్యాచ్ జరిగినా తండోపతండాలుగా వచ్చి తమ మద్దతు చాటుతున్నారు.   

77

రిటైర్మెంట్ కంటే ముందే చెన్నైని మరోసారి విజేతగా నిలిపేందుకు ధోని ఇప్పటివరకూ చేయగలిగిందంతా చేశాడు. కానీ  ఇప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ట్రోఫీని పంచితే ఇద్దరికీ పంచాలి గానీ లీగ్ దశలో ప్రదర్శన కారణంగా  గుజరాత్ కు ఇవ్వడం సరికాదని అదే జరిగితే  మెరీనా తీరాన  అల్లకల్లోలం పుట్టిస్తామని తమిళ తంబీలు వాగ్దానాలు చేస్తున్నారు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Recommended image2
IND vs AFG: లక్నోలో గిల్, ఇషాన్ కిషన్ సెంచరీల మోత.. అఫ్గానిస్తాన్‌ బౌలర్లకు చుక్కలు !
Recommended image3
INDW vs NEDW T20 WC: పాకిస్తాన్‌పై విక్టరీ తర్వాత నెదర్లాండ్స్‌తో టీమిండియా ఫైట్.. షెఫాలీ వర్మపైనే అందరి ఫోకస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved