MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ నలుగురు తప్ప, అందరూ వేలంలోకి... దినేశ్ కార్తీక్, హసరంగ, షాబజ్‌లపై ఆర్‌సీబీ సంచలన నిర్ణయం...

ఆ నలుగురు తప్ప, అందరూ వేలంలోకి... దినేశ్ కార్తీక్, హసరంగ, షాబజ్‌లపై ఆర్‌సీబీ సంచలన నిర్ణయం...

ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడి ఆరో స్థానానికి పరిమితమైంది. చివరి మ్యాచ్‌లో గెలిచి ఉంటే ముంబై ఇండియన్స్‌ని వెనక్కి నెట్టి టాప్ 4లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించి ఉండేది... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 23 2023, 08:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో కూడా చేజేతులా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్‌ని రనౌట్ చేసి ఉంటే ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌లో... కృనాల్ పాండ్యా టీమ్‌ ఐదో స్థానంలో ఉండి ఉండేది..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున అదరగొట్టింది కేవలం నలుగురు ప్లేయర్లే. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్... మిగిలిన ఆర్‌సీబీ ప్లేయర్లు, ఉన్నా లేనట్టే, లేకున్నా ఉన్నట్టే అన్నట్టు ఉండి ఉండన్నట్టు ఉన్నారంతే...

38

గత సీజన్ పర్ఫామెన్స్ కారణంగా అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, షాబజ్ అహ్మద్ వంటి కుర్రాళ్లను టాపార్డర్‌లో ఆడించింది ఆర్‌సీబీ. అయితే అనుజ్ ఓ మ్యాచ్‌లో లోమ్రోర్ మరో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించడం తప్ప... ఈ ముగ్గురు కుర్రాళ్లు, ఆర్‌సీబీని నిలువునా ముంచారు...

48

గత సీజన్‌లో ఆర్‌సీబీకి మ్యాచ్ ఫినిషర్‌గా అదరగొట్టిన దినేశ్ కార్తీక్, ఈ సీజన్‌లో డిజాస్టర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. దినేశ్ కార్తీక్ 2023 సీజన్‌లో 13 మ్యాచుల్లో కలిపి 130 పరుగులే చేశాడు. 

58

టాపార్డర్‌లో ఫాఫ్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మెరుపుల తర్వాత మిడిల్ ఆర్డర్‌లో దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, మహిపాల్, షాబజ్‌లలో ఎవరైనా నిలకడగా రాణించి ఉంటే ఆ టీమ్ బెటర్ ప్లేస్‌లో ఉండేది...
 

68
rcb

rcb

బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ బెస్ట్ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేయగా పదేసి కోట్లు పోసి కొన్న వానిందు హసరంగ, హర్షల్ పటేల్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. జోష్ హజల్‌వుడ్ గాయం కారణంగా ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ...

78
Image credit: PTI

Image credit: PTI

ఎప్పటిలాగే వచ్చే సీజన్‌కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలెట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోర్ ప్లేయర్లను తప్ప మిగిలిన టీమ్ మొత్తాన్ని మార్చాలని ఫిక్స్ అయ్యిందట.

88
Harshal Patel

Harshal Patel

రూ.10.75 కోట్లు పెట్టి కొన్న హర్షల్ పటేల్, రూ. 10.75 కోట్లు తీసుకున్న వానిందు హసరంగ వచ్చే సీజన్ వేలంలో పాల్గొనడం ఖాయమని టాక్ వినబడుతోంది.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Womens T20 WC: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి? పూర్తి ఈక్వేషన్స్ ఇవే
Recommended image2
Harmanpreet Kaur: ఇలాంటి ఆటతో ఎట్ల గెలుస్తాం.. హర్మన్‌ప్రీత్ కౌర్ షాకింగ్ కామెంట్స్ !
Recommended image3
T20 World Cup 2026: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved