ఐపీఎల్ దెబ్బకు డిస్నీ హాట్ స్టార్‌కి భారీ నష్టాలు! 3 నెలల్లోనే 9 మిలియన్ల సబ్‌స్కైబర్లు జంప్...
ఐపీఎల్ డిజిటల్, మొబైల్ ప్రసార హక్కులను కోల్పోయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కి భారీ దెబ్బగా మిగిలింది. ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు, తెలుగు హిందీ సీరియల్స్ వంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఉన్నా... చాలామంది భారతీయులు ఈ యాప్‌ని వాడింది క్రికెట్ చూడడానికే...
PTI Photo/R Senthil Kumar)(PTI05_10_2023_000329B)
ఐపీఎల్ 2023 మొబైల్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో నెట్‌వర్క్, జియోసినిమా యాప్‌లో ఉచితంగా మ్యాచులను ప్రసారం చేస్తోంది. 4K టెక్నాలజీతో పాటు నచ్చిన యాంగిల్‌లో, నచ్చిన కెమెరాలో మ్యాచులను చూసేందుకు వీలుగా అనేక ఆప్షన్లను వినియోగదారుల ముందు పెట్టింది జియో సినిమా...
Yashasvi Jaiswal
జియో దెబ్బకు టీవీల్లో ఐపీఎల్ మ్యాచులు చూసే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ కూడా జియో సినిమా యాప్‌లో క్రికెట్ మ్యాచులను చూస్తూ దొరికిపోయాడు..
PTI Photo/Kunal Patil) (PTI05_09_2023_000377B)
ఇదిలా ఉండగా జనవరి 2023 నుంచి మార్చి 2023 మధ్య మూడు నెలల కాలంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా 4.6 మిలియన్ల పెయిడ్ సబ్‌స్కైబర్లను కోల్పోయింది. పాత ప్యాకేజీ అయిపోయిన తర్వాత మళ్లీ హాట్ స్టార్ రీఛార్జ్ చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ పోతోంది..
PTI Photo/Swapan Mahapatra)(PTI05_11_2023_000369B)
ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయం తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోల్పోయిన సబ్‌స్కైబర్ల సంఖ్య 8.4 మిలియన్లకు చేరింది. ఐపీఎల్ మ్యాచులు రాకపోవడంతో మొబైళ్ల నుంచి ఈ యాప్‌ని డిలీట్ చేస్తున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంది..
డిస్నీ ప్లస్ హట్ స్టార్‌లో రియల్ టైమ్ 18 మిలియన్లు రావడమే అత్యధికం. అలాంటిది ఐపీఎల్ 2023 సీజన్‌లో జియో సినిమా యాప్‌లో ఇది 2.4 కోట్లను తాకింది. అయితే 25 శాతం ఎక్కువ...
PTI Photo/Manvender Vashist Lav) (PTI05_03_2023_000448B)
అంతేకాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సగటున ఐపీఎల్ మ్యాచులు చూసే వారి సంఖ్య 30 లక్షలు- 50 లక్షలు దాటేది కాదు. అయితే ఉచితంగా మ్యాచులు అందిస్తున్న జియో సినిమా యాప్‌లో ఈ సంఖ్య 11 నుంచి 15 మిలియన్ల దాకా ఉంటోంది..