- Home
- Sports
- Cricket
- గౌతమ్ గంభీర్‌పై ‘భష్మాసుర్’ అంటూ ట్రోల్స్... రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేసిన లక్నో మెంటర్...
గౌతమ్ గంభీర్‌పై ‘భష్మాసుర్’ అంటూ ట్రోల్స్... రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేసిన లక్నో మెంటర్...
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో గౌతమ్ గంభీర్ ఒకడు. ఢిల్లీకి టైటిల్ అందించలేకపోయిన గౌతమ్ గంభీర్, రెండుసార్లు కేకేఆర్‌ని టైటిల్ విజేతగా నిలిపాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌కి మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు..

gambhir kohli
మెంటర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా గౌతమ్ గంభీర్ ఆవేశం, దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. పైపెచ్చు ఇంకా పెరిగినట్టే కనిపిస్తోంది. ప్రతీ మ్యాచ్ విజయం తర్వాత అరుస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ టీమ్ ప్లేయర్లలో జోష్ నింపుతున్నాడు గౌతమ్ గంభీర్...
బెంగళూరులో ఆర్‌సీబీపై ఆఖరి బంతికి విజయం అందుకున్న తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్, బెంగళూరు ఫ్యాన్స్‌ని చూసి ‘నోరు మూసుకోండి’ అంటూ సైగలతో నోటీ మీద వేలు వేసుకుని చూపించాడు. ఇది విరాట్ కోహ్లీకి కోపం తెప్పించింది..
Kohli vs Gambhir
ఈ సంఘటన తర్వాత లక్నోలో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇది జరిగిన కొన్ని రోజులకే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బెంగళూరులో బీజేపీ ఎంపీ, కోహ్లీతో గొడవ పడడం వల్లే ఆ పార్టీ ఓడిపోయిందంటూ మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి..
అయితే ఐపీఎల్ వార్తలను కవర్ చేస్తున్న పంజాబీ కేసరి అనే ఓ హిందీ వార్త పత్రిక, గౌతమ్ గంభీర్‌ని భస్మాసురుడు అంటూ కథనాలు ప్రచారం చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఆ పత్రికపై రూ.2 కోట్ల పరువు నష్టం దావా వేశాడు గౌతమ్ గంభీర్...
Rahul-Gambhir
‘ఎంపీ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు ఢిల్లీ గల్లీల్లో ప్రత్యక్షమయ్యాయి..’, ‘ఢిల్లీ మిస్సింగ్ ఎంపీ, లక్నో సూపర్ జెయింట్స్‌కి భస్మాసురుడిగా మారాడు’ అంటూ గౌతమ్ గంభీర్‌ని దూషిసతూ కథనాలు ప్రచురించింది పంజాబీ కేసరి...
Dhoni-Gambhir
‘పార్లమెంట్ సభ్యుడిగా గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సదరు వార్త పత్రిక కథనాలు ప్రచురించింది. వాస్తవాలు తెలుసుకునేందుకు, కనీసం విషయాన్ని అర్థం చేసుకునేందుకు కానీ ప్రచురణ కర్తలు ప్రయత్నం చేయకుండా దుష్పచారం చేస్తున్నారు.
ఇది గౌతమ్ గంభీర్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి జరుగుతున్న కుట్రగా తెలుస్తోంది..’ అంటూ గంభీర్ తరుపు న్యాయవాది వేసిన పిల్‌లో తెలియచేశాడు..
Gautam Gambhir
భస్మాసుర అంటూ రాక్షసుడితో పోలుస్తూ కథనాలు రాసినందుకు పరువు నష్టం కింద రూ.2 కోట్ల జరిమానాతో పాటు పంజాబ్ కేసరీ ప్రచురిస్తున్న అన్ని పత్రికల్లో, వెబ్‌సైట్లలో బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందిగా కోరాడు గౌతమ్ గంభీర్..