MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అసలు మీ టీమ్, ఒక్క మ్యాచ్ అయినా సరిగా ఆడిందా... సౌరవ్ గంగూలీకి రవిశాస్త్రి ప్రశ్న...

అసలు మీ టీమ్, ఒక్క మ్యాచ్ అయినా సరిగా ఆడిందా... సౌరవ్ గంగూలీకి రవిశాస్త్రి ప్రశ్న...

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా ఐదుకి ఐదు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే ఏదైనా ఊహించని అద్భుతం జరగాల్సిందే. ఢిల్లీ టీమ్ వరుస వైఫల్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 17 2023, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

‘ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇక కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయి, ఆఖరి నుంచి టాప్ 4లో కూడా చోటు కోల్పోయారు. మిగిలిన టీమ్స్ అన్నీ కనీసం రెండు మ్యాచులు గెలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా బోణీ కొట్టలేదు...

26
Image credit: PTI

Image credit: PTI

ఢిల్లీ డగౌట్‌లో ఉన్నవాళ్లకు ఓడిపోవడం తెలీదు. రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్.. అందరూ ఎన్నో విజయాలు అందుకున్నవాళ్లే. ప్రతీ టీమ్ ఓడిపోతుంది. ఓడిపోవడం తప్పే కాదు. అయితే ఓడుతున్న విధానమే అసలు సమస్య...
 

36
Image credit: Delhi Capitals

Image credit: Delhi Capitals

ఐదు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ బాగా ఆడిందని అనిపించలేదు. కనీస పోరాటం కూడా చూపించడం లేదు. చివరిదాకా పోరాడి ఓడిపోతే అనుకోవచ్చు కానీ ఢిల్లీ క్యాపిటల్స్, ప్రత్యర్థి చేతుల్లో చిత్తుగా ఓడుతోంది. ఇది ఏ మాత్రం మంచిది కాదు...
 

46
Image credit: PTI

Image credit: PTI

బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, ఢిల్లీ క్యాపిటిల్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఈజీగా గెలువచ్చని అనుకుని ఉంటాడు కానీ టీమ్ ఇలా ఆడుతుందని అస్సలు ఊహించి ఉండడు.

56
Image credit: PTI

Image credit: PTI

బీసీసీఐ ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఫెయిల్ అవుతున్న టీమ్‌లో ఉండడం దాదాకి నచ్చకపోవచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

66
PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000300B)

PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000300B)

తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో 50 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఓడింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో 57 పరుగుల తేడాతో ఓడి హ్యాట్రిక్ కొట్టిన ఢిల్లీ, ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓడింది క్యాపిటల్స్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
IPL హిస్టరీలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన టాప్ 10 భారత ప్లేయర్లు ఎవరు?
Recommended image2
వరల్డ్ కప్ కొట్టిన తర్వాత మనోళ్లు ఎక్కడికి వెళ్లారో తెలుసా? సంజూ మాస్ రోడ్ ట్రిప్
Recommended image3
RCB vs SRH : హైదరాబాద్ కొట్టే రన్స్ ఓకే.. IPL 2026 లో వికెట్లు తీసేదెవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved