MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • కెప్టెన్సీ ఇవ్వలేదనే అక్కసుతోనే అట్టర్ ఫ్లాప్ అవుతున్న పృథ్వీ షా... కోహ్లీ అయినా ఇలా ఆడితే ఇంటికే...

కెప్టెన్సీ ఇవ్వలేదనే అక్కసుతోనే అట్టర్ ఫ్లాప్ అవుతున్న పృథ్వీ షా... కోహ్లీ అయినా ఇలా ఆడితే ఇంటికే...

పృథ్వీ షా... టీమిండియాలోకి సంచలనంలా దూసుకొచ్చిన క్రికెటర్. మొదటి టెస్టులోనే భారీ సెంచరీ చేసి, తానేం చేయగలనో నిరూపించుకున్నాడు. టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా కనిపించిన పృథ్వీ షా, ఇప్పుడు పూర్తిగా డౌన్ స్టేజీలో ఉన్నాడు... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 22 2023, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో ఆడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 పరుగులే చేసి అవుట్ అయ్యాడు పృథ్వీ షా. ఆ మ్యాచ్ నుంచే పృథ్వీ షా కెరీర్‌ యూ టర్న్ తీసుకుంది. బ్రిస్బేన్ టెస్టు సమయానికి టీమ్‌లో అరడజనుకి పైగా సీనియర్ ప్లేయర్లు గాయాలతో తప్పుకున్నా పృథ్వీ షాని పట్టించుకోలేదు టీమ్ మేనేజ్‌మెంట్...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆ తర్వాత టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయిన పృథ్వీ షా... వన్డేల్లో, టీ20ల్లో ఒకటి అరా ఛాన్సులు దక్కించుకున్నా... వాటిని సరిగ్గా వాడుకోలేకపోయాడు. అయితే ఐపీఎల్‌లో రాణిస్తూ, అతన్ని టీమ్‌కి సెలక్ట్ చేయనందుకు సెలక్టర్లపై విమర్శలు వచ్చేలా చేశాడు. అయితే ఈ సీజన్‌లో అది కూడా పోయింది...

39

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 5 మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ఎట్టకేలకు కేకేఆర్‌పై బోణీ కొట్టింది. అయితే ఇప్పటిదాకా పృథ్వీ షా ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. 6 మ్యాచుల్లో రెండు సార్లు డకౌట్ అయిన పృథ్వీ ... 12, 7, 0, 1, 0, 13 పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

49

‘పృథ్వీ షా ఓ భారీ ఇన్నింగ్స్ ఆడి తీరాల్సిందే. ఎందుకంటే ఏదో కుర్రాడిలో టాలెంట్ ఉంది కదా అని వరుసగా ఫెయిల్ అవుతున్నా భరిస్తూ ఉండే ఓపిక ఫ్రాంఛైజీలకు ఉండదు. ఇప్పటికైనా పృథ్వీ షా, జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి జాగ్రత్త పడితే బెటర్. పవర్ ప్లేలో కూడా పృథ్వీ షా పరుగులు చేయలేకపోతున్నాడు...

59

ఈ సీజన్‌లో మార్క్ వుడ్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. సరైన ఫుట్‌వర్క్ లేదు, ఆడాలని ఇంట్రెస్ట్ కానీ, ఇంటెన్స్ కానీ అతనిలో కనిపించడం లేదు. అతను క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అవుట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నట్టు ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్...

69
PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)

PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పృథ్వీ షా బ్యాటింగ్‌ని చీల్చి చెండాడేశాడు. ‘పృథ్వీ షాతో కలిసి అండర్19 ఆడిన శుబ్‌మన్ గిల్ ఇప్పుడు టీమిండియాకి టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడుతున్నాడు. పృథ్వీ షా ఇంకా ఐపీఎల్‌లో ఆడేందుకే తెగ కష్టపడుతున్నాడు...

79

ప్రతీ క్రికెటర్‌కి బ్యాడ్ ఫేజ్ సాధారణ విషయమే కానీ పృథ్వీ షా అవుట్ అవుతున్న విధానమే దారుణంగా ఉంది. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. నిజంగా అతనికి ఆడడం ఇష్టం ఉందా అనే అనుమానం కలుగుతోంది...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...

89


అయితే పృథ్వీ షా ఫెయిల్యూర్‌కి కెప్టెన్సీ ఇవ్వలేదనే కోపంగా కారణంగా చెబుతున్నారు కొందరు నెటిజన్లు. రిషబ్ పంత్ గాయపడడంతో ముంబై కెప్టెన్‌గా ఉన్న పృథ్వీ షా, తనకే కెప్టెన్సీ దక్కుతుందని భావించాడని, అయితే వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వకపోవడంతో ఇలా ఆడుతున్నాడని అంటున్నారు...

99

ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మ్యాచులు ఫెయిల్ అయితే కెప్టెన్‌ని మార్చి, తనకి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని పృథ్వీ షా అనుకుంటున్నాడేమోనని కామెంట్లు పెడుతున్నారు. అయితే వార్నర్ ఫెయిల్ అయ్యి, తాను బాగా ఆడితే పృథ్వీ షాకి కెప్టెన్సీ దక్కవచ్చేమో కానీ మరీ ఇంత దారుణంగా ఆడుతుంటే విరాట్ కోహ్లీని అయినా టీమ్ నుంచి తప్పించాల్సి ఉంటుందనే చిన్న విషయాన్ని అతను గ్రహించడం లేదని వాపోతున్నారు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved