MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • కోపంతో కొడుతున్నారు సార్! నా కెప్టెన్సీలో ఏదో తప్పుదనుకుంటా... కెఎల్ రాహుల్ కామెంట్స్...

కోపంతో కొడుతున్నారు సార్! నా కెప్టెన్సీలో ఏదో తప్పుదనుకుంటా... కెఎల్ రాహుల్ కామెంట్స్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన లక్నో సూపర్ జెయింట్స్, ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. అయితే మొదటి ఎలిమినేటర్‌లో ఓడిన లక్నో, ఈసారి భారీ అంచనాలతో సీజన్‌ని మొదలెట్టింది. అనుకున్నదాని కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇస్తూ టాప్ 2లో కొనసాగుతోంది... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 20 2023, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image credit: PTI

Image credit: PTI

ఆర్‌సీబీతో హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి నెట్టిన లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌తో లో స్కోరింగ్ మ్యాచ్‌లో 154 పరుగుల ఈజీ టార్గెట్‌ని నిలువరించి సంచలన విజయం అందుకుంది... 
 

28
Image credit: PTI

Image credit: PTI

జిడ్డు బ్యాటింగ్‌తో మ్యాచ్ చూసే ప్రేక్షకులను విసిగించిన లక్నో సూపర్ జెయింట్స్, బౌలింగ్‌లో మాత్రం అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. రాజస్థాన్ ఈజీగా గెలుస్తుందని అనుకున్న ఫ్యాన్స్‌కి, వారి బ్యాటింగ్ చూసి షాక్ తగిలింది...

38
Image credit: PTI

Image credit: PTI

‘నా కెప్టెన్సీలోనే ఏదో తప్పు ఉందనుకుంటా.. ఏదో ఒక ఉద్దేశంతో నన్ను బాల్‌తో కొడుతున్నారు నా టీమ్‌ మేట్స్. కావాలనే కొడుతున్నట్టు ఉంది...’ అంటూ నవ్వేసిన కెఎల్ రాహుల్, లో స్కోరింగ్‌ని డిఫెండ్ చేసుకోవడంతో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

48
(PTI Photo) (PTI04_19_2023_000222B)

(PTI Photo) (PTI04_19_2023_000222B)

‘10 ఓవర్లు ముగిసిన తర్వాత కైల్ మేయర్స్, ఈ పిచ్ మీద 160 చేసినా ఎక్కువే అని చెప్పాడు. రాజస్థాన్ టీమ్‌లో మంచి బౌలర్లు ఉన్నారు, వాళ్లు పర్ఫెక్ట్ రిజల్ట్ రాబట్టారు. అయితే మా దాంట్లో కూడా మంచి బౌలర్లు ఉన్నారు..

58
KL Rahul

KL Rahul

మేం ఇంకో 10-20 పరుగులు చేయాల్సిందని ఫీల్ అయ్యాం. అయితే బౌలర్లు అదరగొట్టారు. చాలామంది రెండోసారి బ్యాటింగ్ చేయడం వల్ల పిచ్ మీద ఉన్న తేమ, మా బౌలర్లకు బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. అయితే మొదట బ్యాటింగ్ చేసినప్పుడు కూడా మాకు అలాగే అనిపించింది...

68
KL Rahul

KL Rahul

ఇంతకుముందు మ్యాచ్‌లో 180 పరుగులు చేశాం, ఈసారి కూడా అంతకంటే ఎక్కువే చేయొచ్చని అనుకున్నాం. అయితే ట్రెంట్ బౌల్ట్ మెయిడిన్ ఓవర్ వేశక పిచ్ గురించి అర్థమైంది. బాల్, బ్యాటుపైకి అస్సలు రావడం లేదు..

78
PTI Photo) (PTI04_19_2023_000278B)

PTI Photo) (PTI04_19_2023_000278B)

అందుకే పవర్ ప్లే వరకూ సమయం తీసుకోవాలని అనుకున్నాం. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసి ఉంటే 170కి పైగా స్కోరు వచ్చేదేమో కానీ వికెట్లు పడితే ఈ మాత్రం స్కోరు కూడా వచ్చేది కాదు. సంజూ శాంసన్‌ని అమిత్ మిశ్రా రనౌట్ చేయడం, ఆ వెంటనే వరుసగా రెండు వికెట్లు పడడంతో మాకు ఛాన్స్ వచ్చింది..

88

రాజస్థాన్ రాయల్స్‌కి టాప్ 4 బ్యాటర్లే బలం. కాబట్టి ఆ నలుగురినీ అవుట్ చేస్తే చాలు మ్యాచ్ గెలవచ్చని ప్రణాళికలు రచించాం. అనుకున్నట్టే కాస్త లక్ కూడా కలిసి వచ్చి మ్యాచ్‌లో గెలిచాం...’ అంటూ కామెంట్ చేశాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
Sanju : ధోనీ, హార్దిక్‌లకు సంజూ షాక్.. ఇది కదా మాస్ ఎంట్రీ అంటే !
Recommended image2
IPL 2026 : లక్ ఎంతో కాలం ఉండదు బాసూ ! వైభవ్ సూర్యవంశీకి మాస్ వార్నింగ్
Recommended image3
Mumbai Indians : రోహిత్ శర్మకు హార్దిక్ వార్నింగ్? ముంబై ఇండియన్స్ లో ఏం జరుగుతోంది బాసూ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved