- Home
- Sports
- Cricket
- ఇషాన్ కిషన్, కెఎస్ భరత్... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎవరిని ఆడించాలి? సునీల్ గవాస్కర్ కామెంట్స్..
ఇషాన్ కిషన్, కెఎస్ భరత్... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎవరిని ఆడించాలి? సునీల్ గవాస్కర్ కామెంట్స్..
ఐపీఎల్ 2023 సీజన్ మరో రెండు మ్యాచులతో ముగియనుంది. పోటీలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్ కోసం, ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదో టైటిల్ కోసం పోటీపడుతుంటే గుజరాత్ టైటాన్స్ రెండో టైటిల్ కోసం బరిలో దిగుతోంది..
- FB
- TW
- Linkdin
Follow Us
)
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపికైన భారత జట్టులోని రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, శుబ్‌మన్ గిల్, కెఎస్ భరత్.. ఇంకా ఐపీఎల్‌లోనే ఆడుతున్నారు...
కెఎల్ రాహుల్ గాయంతో టీమ్‌కి దూరం కావడంతో అతని ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో బాగానే రాణిస్తున్నాడు. అతని కంటే ముందే టీమ్‌కి సెలక్ట్ అయిన కెఎస్ భరత్‌కి మాత్రం ఇప్పటిదాకా తుది జట్టులో చోటు దక్కలేదు...
ఓపెనర్ వృద్ధిమాన్ సాహాకి వరుస అవకాశాలు ఇస్తున్న గుజరాత్ టైటాన్స్, శ్రీకర్ భరత్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా నేరుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్నాడు శ్రీకర్ భరత్...
KS Bharat
‘ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎవరిని ఆడించాలనేది చాలా క్లిష్టమైన నిర్ణయం. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలని అనుకుంటే కెఎస్ భరత్‌కి అవకాశం ఇవ్వడమే మంచిది.
ఇద్దరిలో ఎవరిని ఆడించాలనే ప్రశ్న వస్తే, ఎవరు బెస్ట్ కీపర్ అని చూడాలి? ఇషాన్ కిషన్ ఆ? లేక శ్రీకర్ భరత్ ఆ. అయితే ఇప్పుడు అంత సమయం లేదు. భరత్, ఇప్పటికే ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ ఆడాడు..
Image credit: PTI
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భరత్‌కి అన్ని మ్యాచుల్లో అవకాశం దక్కింది. మిడిల్ ఆర్డర్‌లో పరుగులు అవసరం అనుకుంటే ఇషాన్ కిషన్‌ని ఆడించాలి. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగితే ఇషాన్ కిషన్ వంటి కీపర్ అవసరం అవుతాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..
KS Bharat
‘ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉండొచ్చు, పరుగులు చేస్తుండొచ్చు. కానీ నేరుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో నేరుగా ఆడించడం కరెక్ట్ కాదు.
Image credit: PTI
ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియాపై ఆరంగ్రేటం చేయడం వల్ల ఆ ఒత్తిడిని ఇషాన్ కిషన్ ఎలా తీసుకుంటాడో చెప్పడం కష్టం.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్..