- Home
- Sports
- Cricket
- మేం 450 కొడతాం, ఇండియా 65కి ఆలౌట్ అయిపోద్ది... వరల్డ్ కప్ ఫైనల్‌పై మిచెల్ మార్ష్ కామెంట్...
మేం 450 కొడతాం, ఇండియా 65కి ఆలౌట్ అయిపోద్ది... వరల్డ్ కప్ ఫైనల్‌పై మిచెల్ మార్ష్ కామెంట్...
ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్న టీమిండియా, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్..

Mitchell Marsh and Josh Hazlewood
ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న మిచెల్ మార్ష్, మొదటి 6 మ్యాచుల్లో కలిపి 57 పరుగులే చేశాడు. సింగిల్ డిజిట్ స్కోర్లతో ఢిల్లీ పరాజయాల్లో కీలక పాత్ర పోషించిన మిచెల్ మార్ష్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 39 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 63 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు..
Mitchell Marsh
ఢిల్లీ క్యాపిటల్స్ పాడ్‌కాస్ట్‌లో మిచెల్ మార్ష్, వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..
Mitchell Marsh
‘ఆస్ట్రేలియా వరుస విజయాలతో ఫైనల్‌కి వెళ్తుంది. ఫైనల్‌లో ఇండియాని ఓడించి వరల్డ్ కప్ గెలుస్తుంది. మేం 450/2 కొడతాం, ఇండియా 65 పరుగులకే ఆలౌట్ అవుతుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు మిచెల్ మార్ష్...
Ricky Ponting
ఆస్ట్రేలియా, టీమిండియాపై 385 పరుగుల తేడాతో గెలిచి, ఆరో సారి వరల్డ్ కప్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు మిచెల్ మార్ష్. 1987లో మొదటిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత 1999, 2003, 2007, 2015 వరల్డ్ కప్ టైటిల్స్ సాధించింది...
Image credit: PTI
2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాని ఓడించింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్‌లో 2 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. కెప్టెన్ రికీ పాంటింగ్ 121 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 234 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, 125 పరుగుల తేడాతో ఓడింది..
Image credit: PTI
2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన టీమిండియా, ఆ తర్వాత 2021 టీ20 వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో విఫలమైంది. అయినా 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్ కావడంతో టీమిండియాపై భారీ అంచనాలున్నాయి..