- Home
- Sports
- Cricket
- వేరే గ్రహం నుంచి ఊడిపడ్డారా? పాకిస్తాన్ లేకుండా క్రికెట్ అసాధ్యం... పాక్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్...
వేరే గ్రహం నుంచి ఊడిపడ్డారా? పాకిస్తాన్ లేకుండా క్రికెట్ అసాధ్యం... పాక్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్...
గత ఏడాది ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందే 2023 ఆసియా కప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. పాక్‌లో ఆసియా కప్ జరిగితే టీమిండియా అక్కడికి వెళ్లదని, వేరే దేశంలో టోర్నీని నిర్వహిస్తామని జై షా చేసిన కామెంట్లపై ఇప్పటికీ అగ్గి రేగుతూనే ఉంది..

ఆసియా కప్ 2023 టోర్నీ కోసం ఇండియా, పాకిస్తాన్‌కి రాకపోతే... పాక్ జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఇండియాకి రాదని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. ఆసియా కప్ 2023 టోర్నీ వేదిక గురించి తేల్చేందుకు ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ మూడు సార్లు సమావేశమైంది..
asia cup
పాక్‌లో అడుగుపెట్టేందుకు ఇటు ఇండియా, పాక్ నుంచి వేరే దేశానికి టోర్నీని తరలించేందుకు అటు పాకిస్తాన్ ఒప్పుకోకపోవడంతో ఆసియా కప్ 2023 టోర్నీ గురించి ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది...
ఈ రెండింటి మధ్య గొడవను తేల్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రయత్నించినా... ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న వైరం కారణంగా రాజకీయ, సాంఘిక అడ్డంకులకు అతీతంగా క్రికెట్ టోర్నీని జరిపించడం అయ్యే పని కాదని చేతులు ఎత్తేసింది...
అయితే పాక్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్, ఇండియాపై ఫైర్ అయ్యాడు. ‘పాకిస్తాన్‌లో ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయి. వేరే టీమ్స్ కూడా ఇక్కడికి వస్తున్నాయి, ఆడుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్స్ వచ్చాయి. వాళ్లకి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రాలేదు..
Image credit: Getty
అలాంటప్పుడు ఇండియాకి ప్రాబ్లమ్స్ ఎందుకువ స్తాయి. వాళ్లేమైనా వేరే గ్రహం నుంచి ఊడిపడ్డారా? వేరే ప్రపంచానికి చెందిన ఏలియెన్స్ ఆ... వాళ్లకెందుకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి..
ఐసీసీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. లేదంటే పాకిస్తాన్ లేకుండా క్రికెట్ జరపడం అసాధ్యం. పాకిస్తాన్ చిన్న టీమ్ కాదు. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ వరల్డ్ నెం.1 టీమ్, ఇప్పుడు టాప్ 3 టీమ్స్‌లో ఒకటిగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్..