- Home
- Sports
- Cricket
- వాళ్లు టీమ్‌లో ఉండి కూడా వేస్టే! ఇలాంటి టీమ్‌తో ఎలా గెలుస్తాం... ఆర్‌సీబీ కోచ్ ఆవేదన...
వాళ్లు టీమ్‌లో ఉండి కూడా వేస్టే! ఇలాంటి టీమ్‌తో ఎలా గెలుస్తాం... ఆర్‌సీబీ కోచ్ ఆవేదన...
ఐపీఎల్ 2020 నుంచి వరుసగా మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈసారి అక్కడి దాకా వెళ్లడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. 11 మ్యాచుల్లో ఐదే విజయాలు అందుకున్న ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 3 మ్యాచుల్లో కచ్ఛితంగా గెలవాలి...

Image credit: PTI
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచుల్లో భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ రెండు వరుస పరాజయాలు ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలకు 22 శాతానికి తగ్గించేశాయి..
Anuj Rawat RCB
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచుల్లో భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ రెండు వరుస పరాజయాలు ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలకు 22 శాతానికి తగ్గించేశాయి..
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ ఎక్కువ మ్యాచుల్లో K.G.F ప్లేయర్లపైనే ఆధారపడింది. ఆడితే విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లిసిస్ ఆడాలి, వీళ్లు కానీ త్వరగా అవుట్ అయితే ఆర్‌సీబీ సంగతి అంతే...
Image credit: PTI
ఒకటి రెండు మ్యాచుల్లో మహిపాల్ లోమ్రోర్ అదరగొట్టినా షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్ వంటి యంగ్ ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దినేశ్ కార్తీక్‌తో పాటు వానిందు హసరంగ, హర్షల్ పటేల్ ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు..
Anuj Rawat RCB
‘కుర్రాళ్లు అనుకున్నట్టుగా సక్సెస్ కావడం లేదు. మహిపాల్ లోమ్రోర్ ఒక్కడే ఇచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకున్నాడు. కానీ అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్ ఇద్దరూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు..
Image credit: PTI
ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని వేస్ట్ చేశారు. కనీసం టీమ్‌లో ఉన్నామనే ఐడెంటిటీ కూడా నిరూపించుకోకపోతే వేస్టే కదా. ఇలాంటి టీమ్‌తో టైటిల్స్ ఎలా గెలవగలం. అయితే కుర్రాళ్ల విషయంలో ఓపిగ్గా ఉండాలని అనుకుంటున్నాం..
అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తేనే వాళ్లు మ్యాచ్ విన్నర్లుగా తయారవుతారు. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్ రూట్‌లో కుర్రాళ్లు కూడా అడుగులు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం... సీనియర్ల అనుభవం, సలహాలు యంగ్ ప్లేయర్లకు ఎంతో ఉపయోగపడతాయి..’ అంటూ కామెంట్ చేశాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ సంజయ్ బంగర్..