- Home
- Sports
- Cricket
- సన్‌రైజర్స్ టీమ్‌లోకి అఖిల్ అక్కినేని, థమన్... ఆరెంజ్ ఆర్మీని కాపాడాలంటే అదొక్కటే మార్గమంటూ...
సన్‌రైజర్స్ టీమ్‌లోకి అఖిల్ అక్కినేని, థమన్... ఆరెంజ్ ఆర్మీని కాపాడాలంటే అదొక్కటే మార్గమంటూ...
ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏ విభాగంలోనూ రాణించలేకపోతోంది సన్‌రైజర్స్. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లోనూ మెప్పించలేని టీమ్స్‌గా ఉన్నాయి..

Image credit: PTI
తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ వస్తాడు, గెలిపిస్తాడు అని ఆశపడ్డారు అభిమానులు. కానీ రెండో మ్యాచ్‌లో అది అంత తేలికైన విషయం కాదని తేలిపోయింది... ఐపీఎల్‌లోనే భీకరమైన బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రెండు మ్యాచుల్లోనూ తేలిపోయింది..
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఓడిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని కాపాడాలంటే అఖిల్ అక్కినేని, ఎస్.ఎస్. థమన్ రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ టీమ్ విజేతగా నిలిచింది..
కెప్టెన్ అఖిల్ అక్కినేని అదిరిపోయే బ్యాటింగ్ పర్ఫామెన్స్‌తో టోర్నీకి స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అఖిల్, సినిమాల్లో కంటే క్రికెట్‌లోకి వెళ్లి ఉంటే బాగా సక్సెస్ అయ్యేవాడని కామెంట్లు కూడా వినిపించాయి. అందుకే ఇప్పుడు సన్‌రైజర్స్‌కి అఖిల్ లాంటి బ్యాటర్ కావాలని అంటున్నారు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్...
అలాగే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక సినిమాలకు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్న థమన్, మరోవైపు కొన్ని టీవీ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు..
CCL 2023
ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న థమన్, ఫీల్డింగ్ తప్పిదాలను జనాలను కడుప్పుబ్బా నవ్వించడమే కాకుండా కీలక సమయంలో వికెట్లు తీశాడు, అవసరమైనప్పుడు బ్యాటు ఝులిపించి మ్యాచ్‌లను గెలిపించాడు. మొత్తంగా టోర్నీలో మోస్ట్ ఎంటర్‌టైయినింగ్ ప్లేయర్‌ని నిలిచాడు..
Image credit: PTI
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మిస్ అవుతుంది ఇదే. డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్ ఉన్నప్పుడు సన్‌రైజర్స్ టీమ్‌ని సొంత టీమ్‌గా అనుకుని ఆడేవాళ్లు. ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీలో ఉన్నవాళ్లంతా ఏదో నామమాత్రంగా ఆడుతున్నట్టు కనిపిస్తోంది.
టీమ్‌లో ఏ ఒక్క ప్లేయర్‌లోనూ జోష్, ఉత్సాహం కనిపించడం లేదు. థమన్ లాంటి ఎంటర్‌టైయినర్ వస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతీ మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తూ గెలవడం నేర్చుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు.. కావ్య పాప ఎలాగైనా వాళ్లను ఒప్పించే పనిలో ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..